Beauty Tips: రోజూ రాత్రి కళ్లకింద ఇది రాస్తే.. డార్క్ సర్కిల్స్ ఇట్టే పోతాయ్
ముఖం ఎంత తెల్లగా ఉన్న కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉంటే.. చూడటానికి అందంగా కనిపించదు. ఈరోజుల్లో విద్యార్థుల నుంచి గృహిణుల వరకూ ఎదుర్కొంటున్న సమస్య. ఎక్కువగా ఫోన్లు చూడటం, అతిగా ల్యాప్ టాప్ ల ముందు పనిచేయడం, నిద్రలేమి కారణంగా కంటిచుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతాయి. శరీరంలో ఎలాసిటి తగ్గడం, డీ హైడ్రేషన్, జెనెటిక్స్ కారణం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. నల్లటివలయాలను తగ్గించుకునేందుకు..
ముఖం ఎంత తెల్లగా ఉన్న కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉంటే.. చూడటానికి అందంగా కనిపించదు. ఈరోజుల్లో విద్యార్థుల నుంచి గృహిణుల వరకూ ఎదుర్కొంటున్న సమస్య. ఎక్కువగా ఫోన్లు చూడటం, అతిగా ల్యాప్ టాప్ ల ముందు పనిచేయడం, నిద్రలేమి కారణంగా కంటిచుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతాయి. శరీరంలో ఎలాసిటి తగ్గడం, డీ హైడ్రేషన్, జెనెటిక్స్ కారణం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. నల్లటివలయాలను తగ్గించుకునేందుకు రకరకాల క్రీమ్ లు వాడి వాడి అలసిపోయారా ? ఒక్కసారి ఈ చిట్కా ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది.
-ఈ చిట్కా కోసం ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్ (కలబంద గుజ్జు), విటమిన్ ఈ క్యాప్సుల్ సిద్ధంగా ఉంచుకోవాలి.
-ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి, అలోవెరా జెల్ ను వేసి కలపాలి. ఆ తర్వాత విటమిన్ ఇ క్యాప్సుల్ లో ఉండే ఆయిల్ ను ఈ మిశ్రమంలో వేసి కలపాలి.
-ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ రాసుకుని.. సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఉదయం లేచాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
-ఇలా ప్రతిరోజూ రాత్రి.. క్రమం తప్పకుండా వారంరోజులు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. నెమ్మదిగా కళ్లకింద నలుపు తగ్గి.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి