Bholaa Shankar: చిరంజీవి మంచోడు.. ముంచేశారు.. పవన్‌ మొండోడు.. లెక్కలు తేలుస్తాడు: హైపర్‌ ఆది

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆదివారం (ఆగస్టు 6) గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా జరిగిన ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్‌కు భోళాశంకర్‌ యూనిట్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్‍లో జబర్దస్త్‌ కమెడియన్ హైపర్ ఆది స్పీచ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని విమర్శించే వారికి తనదైన పంచ్‌లు..

Bholaa Shankar: చిరంజీవి మంచోడు.. ముంచేశారు.. పవన్‌ మొండోడు.. లెక్కలు తేలుస్తాడు: హైపర్‌ ఆది
Hyper Aadi, Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Aug 07, 2023 | 6:02 AM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆదివారం (ఆగస్టు 6) గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా జరిగిన ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్‌కు భోళాశంకర్‌ యూనిట్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్‍లో జబర్దస్త్‌ కమెడియన్ హైపర్ ఆది స్పీచ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని విమర్శించే వారికి తనదైన పంచ్‌లు, ప్రాసలతో గట్టిగా బదులిచ్చాడు హైపర్‌ ఆది. ‘నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి , సచిన్ టెండూల్కర్ ఒక్కటే. సచిన్‌ను ఎవరైనా విమర్శిస్తే నోటితో సమాధానం చెప్పడు.. బ్యాట్‍తోనే బదులిస్తాడు. చిరంజీవి కూడా అంతే. ఆచార్య సినిమాపై విమర్శలు వచ్చాయి. వాల్తేరు వీరయ్యతో వాళ్లందరి నోరూ మూపించాడు. అది మెగాస్టార్‌ చిరంజీవి. సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ చిరంజీవికి హీరోలే ఫ్యాన్స్ గా ఉంటారు. ఆస్తులు సంపాదించడం కన్నా అభిమానం సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారాయన. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు గానీ ప్రతి ఇంట్లో ఒక్కరైనా చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు’ అని మెగా ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్‌ తెప్పించాడు ఆది.

మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌లపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు హైపర్‌ ఆది. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘ అన్నయ్య మంచోడు.. కాబట్టి ముంచేశారు. కానీ తమ్ముడు అలా కాదమ్మా.. చాలా మొండోడు. తాడోపేడో తేల్చుకుంటాడు. గట్టిగా ఇచ్చిపడేస్తాడు. అందరి లెక్కలు తేలుస్తాడు’ అంటూ జనసేన అధినేత పవన్‌పై అభిమానం చాటుకున్నారు ఆది. ఇక రామ్‌ చరణ్‌ గురించి మాట్లాడుతూ ‘ సచిన్‌ కుమారుడు సచిన్‌ కాలేదు. అమితాబ్‌ కుమారుడు అమితాబ్‌ కాలేదు. కానీ చిరంజీవి కొడకు మాత్రం చిరంజీవి అయ్యాడు. కొణిదెల వెంకట్రావ్‌కి చిరంజీవి ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టాడో.. అంతకన్నా గొప్ప పేరు చిరంజీవికి రామ్‌ చరణ్‌ తెచ్చిపెట్టాడు. చరణ్‌కు గ్లోబల్‌ స్టార్‌ అని పేరు ఊరికే రాలేదు’ అని చెప్పుకొచ్చాడు ఆది. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఆది స్పీచ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ