Bhola Shankar: భోళా శంకర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. స్టైలీష్ లుక్లో చిరు..
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న చిరు.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా భోళా శంకర్. డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోండగా.. కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న చిరు.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగాఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
ట్రైలర్ లో ప్రదర్శించిన కొత్త పాట కొట్టారా కొట్టు తీనుమారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తీసుకువస్తున్నారు డైరెక్టర్ మెహర్ రమేశ్. సీబీఎఫ్‌సీ ప్రకారం ఈ సినిమా నిడివి 160 నిమిషాలు అంటే 2 గంటల 40 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌లో చిరంజీవి ఇమేజ్, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేశాడట డైరెక్టర్ మెహర్ రమేశ్.
ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్ నటించిన ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే థియేటర్ల వద్ద భోళా శంకర్ మేనియా మొదలైంది.




