- Telugu News Photo Gallery Cinema photos Rakul Preeth Singh more of films doing in Bollywood but what about Tollywood movies Telugu Entertainment Photos
Rakul Preeth Singh: బాలీవుడ్ సినిమాలపై మోజుతో సోత్ సినిమాలను దూరం పెట్టేసిన రకుల్..
షార్ట్ టైమ్‌లోనే స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్... సడన్‌గా సౌత్ సినిమాకు దూరమయ్యారు. బాలీవుడ్ ఆశలతో నార్త్ బాట పట్టిన ఈ బ్యూటీకి అక్కడ కూడా అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. దీంతో అమ్మడి కెరీర్ స్లో అయ్యింది. అయినా సరే సౌత్ సినిమాలు మాత్రం ఓకే చేయటం లేదు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఈ బ్యూటీ జోరు పెద్దగా కనిపించటం లేదు.
Updated on: Aug 06, 2023 | 7:47 PM

షార్ట్ టైమ్‌లోనే స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్... సడన్‌గా సౌత్ సినిమాకు దూరమయ్యారు. బాలీవుడ్ ఆశలతో నార్త్ బాట పట్టిన ఈ బ్యూటీకి అక్కడ కూడా అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. దీంతో అమ్మడి కెరీర్ స్లో అయ్యింది.

అయినా సరే సౌత్ సినిమాలు మాత్రం ఓకే చేయటం లేదు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నా... సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఈ బ్యూటీ జోరు పెద్దగా కనిపించటం లేదు.సౌత్‌లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్... బాలీవుడ్‌లో మాత్రం ఆ రేంజ్ ఫామ్ చూపించలేకపోతున్నారు.

అజయ్ దేవగన్ అండతో అవకాశాలు వస్తున్నా.. స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ మాత్రం అందటం లేదు. బాలీవుడ్ ఆశలతో సౌత్ సినిమాకు దూరమవ్వటంతో ఇక్కడ కూడా ఈ బ్యూటీ అవకాశాలు తగ్గిపోయాయి.

నార్త్ మీద ఆశలతో సౌత్ సినిమాకు దూరమైన రకుల్... సౌత్‌లో అవకాశాలు తగ్గిపోయాయన్న విషయాన్ని మాత్రం అంగీకరించటం లేదు. రీసెంట్ టైమ్స్‌లో ఈ బ్యూటీ నటించిన బాలీవుడ్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ బాట పట్టాయి. దీంతో రకుల్ కెరీర్ క్లైమాక్స్‌కు వచ్చినట్టేనా అన్న డిస్కషన్ మొదలైంది. ఈ టైమ్‌లో అయిన సౌత్ రీ ఎంట్రీ గురించి ఆలోచిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఆ మధ్య సౌత్ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటని అడిగిన మీడియాకు దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు రకుల్. సౌత్ మేకర్స్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలేవి రావటం లేదని.. అందుకే ఇక్కడ సినిమాలు చేయటం లేదన్నారు రకుల్. నిజంగానే రకుల్‌కు అలాంటి ఆఫర్స్ రావటం లేదా..? లేక ఎవరు ఆఫర్స్ ఇవ్వటం లేదు కాబట్టి రకుల్ అలా కవర్ చేస్తున్నారా..?

సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా... సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. వరుసగా వెకేషన్ అప్‌డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న గ్లామర్ ఇమేజ్‌ను సిల్వర్ స్క్రీన్ మీద క్యాష్ చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు రకుల్.




