Folk Singer: కలానికి పదునెక్కువ.. గళానికి గాంభీర్యమెక్కువ.. ఈ గాయకుడిని గుర్తుపట్టారా?
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఆయన పేరు వింటేనే చాలామంది ఉప్పొంగిపోతారు. ఆయన గొంతు వింటే రోమాలు నిక్కబొడుస్తాయి. ఆయన నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటా లాంటిది . అందుకే ఆయన కలం, గళం కోట్లాది మందిని చైతన్యవంతులను చేసింది. ప్రజా ఉద్యమాల వైపు నడిచింది. తుపాకీ తోనే కాదు పాటలతోనూ...
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఆయన పేరు వింటేనే చాలామంది ఉప్పొంగిపోతారు. ఇక ఆయన గొంతు వింటే రోమాలు నిక్కబొడుస్తాయి. ఆయన నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటా. అందుకే ఆయన కలం, గళం కోట్లాది మందిని చైతన్యవంతులను చేసింది. ప్రజా ఉద్యమాల వైపు నడిచింది. ముఖ్యంగా తన పాటలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. ఈ పాటికే అందరికీ అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆయన మరెరవో కాదు.. ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్. ప్రజా సమస్యలపై పాటల రూపంలో కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన గద్దర్ ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గద్దర్ గళం ఇక వినిపించదని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్‌కు నివాళి అర్పిస్తున్నారు. అన్నట్లు ఈ ప్రజాగాయకుడికి వెండితెరతోనూ మంచి అనుబంధం ఉంది. ప్రజా సమస్యలపై తెరకెక్కించిన ‘మా భూమి’ సినిమాలో గద్దర్ నటించారు. సాయిచంద్, రామిరెడ్డి, తెలంగాణ శకుంతల కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో ‘బండెనక బండి కట్టి’ అనే పాటను ఆలపిస్తూ గద్దర్ కనిపిస్తారు. పై ఫొటోలు ఆ పాటలోనివే.
మా భూమి ఒక్కటే కాదు.. ఆర్ నారాయణమూర్తి నటించిన ‘ఓరేయ్ రిక్షా’ లో గద్దర్ రాసిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ అనే ఎవర్ గ్రీన్ పాటను గద్దరే రచించారు. ఈ పాటకు నంది అవార్డు కూడా వరించింది. అయితే ఎందుకో కానీ ఆయన తిరస్కరించారు. ఇక 2011లో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ పాట తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది. ఈ పాటతోనూ సిల్వర్ స్క్రీన్‌పైనా మెరిశారీ ప్రజాగాయకుడు. ఇక విశాఖ ఉక్కు నేపథ్యంలో సత్యారెడ్డి తెరకెక్కిస్తోన్న ఉక్కు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు గద్దర్. ఈ సినిమాలో రెండు పాటలు కూడా రాశారాయన. మొత్తానికి తుపాకులతోనే కాదు, పాటలతోనూ సమ సమాజ స్థాపన చేయవచ్చని నిరూపించారు గద్దర్. ఆయన మరణించినా పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్యే అజరామరుడిగా నిలిచిపోతారాయన.
సిల్వర్ స్క్రీన్ పై గద్దర్
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..