Tamannaah: మిల్కీ బ్యూటీ మంచి మనసు.. తన చేయి పట్టుకున్న అభిమానిని తమన్నా ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్‌

టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లంటూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. సౌత్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు, సిరీస్‌లు చేస్తోంది. ఇటీవల జీ కర్దా, లస్ట్‌ స్టోరీస్‌ వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను పలకరించింది తమన్నా. ప్రస్తుతం ఆమె నటించిన జైలర్‌, భోళాశంకర్‌ ఒకరోజు గ్యాప్‌లో విడుదల కానున్నాయి.

Tamannaah: మిల్కీ బ్యూటీ మంచి మనసు.. తన చేయి పట్టుకున్న అభిమానిని తమన్నా ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్‌
Tamannaah Bhatia
Follow us
Basha Shek

|

Updated on: Aug 07, 2023 | 6:25 AM

టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లంటూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. సౌత్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు, సిరీస్‌లు చేస్తోంది. ఇటీవల జీ కర్దా, లస్ట్‌ స్టోరీస్‌ వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను పలకరించింది తమన్నా. ప్రస్తుతం ఆమె నటించిన జైలర్‌, భోళాశంకర్‌ ఒకరోజు గ్యాప్‌లో విడుదల కానున్నాయి. జైలర్‌లో రజనీకాంత్‌ హీరోగా నటిస్తుండగా, భోళాశంకర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడు. ఇదిలా ఉంటే తాజాగా కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వెళ్లింది తమన్నా. ఈ విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు. బౌన్సర్లు ఉన్నా అభిమానుల తాకిడి ఎక్కువైంది. ఇంతలోనే ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. బౌన్సర్లు ఉండగానే.. వారందరినీ దాటుకుంటూ వచ్చి ఒక అభిమాని తమన్నా చేయిని పట్టుకున్నాడు. దీంతో తమన్నా, బౌన్సర్లతో పాటు అక్కడున్నవారు షాక్‌ కు గురయ్యారు. బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే తన మంచి మనసును చాటుకుంది తమన్నా. అభిమాని ఉత్సాహాన్ని అర్థం చేసుకున్న మిల్కీ బ్యూటీ బౌన్సర్లకు నచ్చజెప్పింది. సదరు అభిమానిని ఏమీ చేయవద్దని సూచించింది.

అంతేకాదు.. ఆ అభిమానికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది. ఆ తర్వాత సరదాగా సెల్ఫీలు కూడా దిగింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గట్టిగా కేకలు వేస్తూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమన్నా మంచి మనసును పొగుడతూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భోళాశంకర్‌ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తోంది. అలాగే మహానటి కీర్తి సురేష్‌ మెగాస్టార్‌ చెల్లెలిగా నటిస్తోంది. సుశాంత్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ