Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య ‘ 200 రోజుల వేడుక.. చరిత్రను తిరగరాసినట్లుంది.. మెగాస్టార్‌ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహరాజా రవితేజ హీరోలుగా నటించిన మెగా మల్టీ స్టారర్‌ మూవీ వాల్తేరు వీరయ్య. కే.ఎస్. రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించగా, క్యాథరీన్‌ థెరిస్సా కీలక పాత్రలో నటించారు. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ మెగా మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది

Chiranjeevi:  'వాల్తేరు వీరయ్య ' 200 రోజుల వేడుక.. చరిత్రను తిరగరాసినట్లుంది.. మెగాస్టార్‌ చిరంజీవి
Waltairveerayya Celebrations
Follow us
Basha Shek

|

Updated on: Aug 08, 2023 | 6:05 AM

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహరాజా రవితేజ హీరోలుగా నటించిన మెగా మల్టీ స్టారర్‌ మూవీ వాల్తేరు వీరయ్య. కే.ఎస్. రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించగా, క్యాథరీన్‌ థెరిస్సా కీలక పాత్రలో నటించారు. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ మెగా మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా మెగాస్టార్‌ వింటేజ్‌ లుక్‌, డైలాగ్స్‌, కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌, డ్యాన్స్‌.. ఇలా అన్నీ అంశాలు అభిమానులనే సగటు సినీ ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టాడు వాల్తేరు వీరయ్య. కాగా ఈ మెగా మల్టీ స్టారర్‌ మూవీ పలు థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ హైదరాబాద్‌లో ప్రత్యేక సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. మెగాస్టార్‌ చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీతో పాటు హరీష్‌ శంకర్‌, ఉప్పెన బుచ్చిబాబు, గోపీచంద్‌ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి తదితరులు ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా వేడుకను ఉద్దేశించిన మాట్లాడిన చిరంజీవి ఎమోషనల్‌ అయ్యారు.

‘ వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్లుంది’ అని ఎమోషనల్‌ అయ్యారు. కాగా వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా చిరంజీవి, రవితేజ కలిసున్న ఫొటోస్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. వాల్తేరు వీరయ్య తర్వాత భోళాశంకరుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చిరంజీవి. మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్‌ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. సుశాంత్‌ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?