AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neymar OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. ‘నెయ్‌మార్’ తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇటీవల రిలీజైన 2018 సినిమా ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే నెయ్‌మార్‌. ఈ పేరు వింటే చాలామందికి బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు స్టార్‌ ప్లేయర్‌ నెయ్‌మార్‌ గుర్తకు వస్తాడు. అయితే ఇదే పేరుతో మలయాళంలో విడుదలైన ఓ చిన్న సినిమా ఏకంగా 50 రోజుల పాటు థియేటర్లలో ఆడి సంచలనం సృష్టించిందీ.

Neymar OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. 'నెయ్‌మార్' తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Neymar Movie
Basha Shek
|

Updated on: Aug 08, 2023 | 6:00 AM

Share

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్‌, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆసక్తికరమైన కథా, కథనాలతో కూడిన ఈ మూవీస్‌ను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారు. లవ్‌, కామెడీ, యాక్షన్‌, సస్పెన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌.. ఇలా అన్ని రకాల జోనర్ల సినిమాలతో అక్కడి డైరెక్టర్లు మాయ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన 2018 సినిమా ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే నెయ్‌మార్‌. ఈ పేరు వింటే చాలామందికి బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు స్టార్‌ ప్లేయర్‌ నెయ్‌మార్‌ గుర్తకు వస్తాడు. అయితే ఇదే పేరుతో మలయాళంలో విడుదలైన ఓ చిన్న సినిమా ఏకంగా 50 రోజుల పాటు థియేటర్లలో ఆడి సంచలనం సృష్టించిందీ. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం కుక్క చుట్టూ తిరిగే కథతో నెయ్‌మార్ సినిమాలో మాథ్యూ థామస్, నస్లెన్ కే గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మంగళవారం (ఆగస్టు 8) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

777 చార్లీ తరహాలో..

సుధీ మాడిసన్ దర్శకత్వం వహించిన నెయ్‌మార్‌ సినిమా కథ మొత్తం ఒక కుక్క చుట్టూనే తిరుగుతుంది. కొన్ని నెలల క్రితం కన్నడలో రిలీజై ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన 777 చార్లీ తరహాలోనే ఎంతో వినోదాత్మకంగా నెయ్‌మార్‌ మూవీ తెరకెక్కింది. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నెయ్‌మార్‌ అభిమానులైన మాథ్యూ థామస్, నస్లెన్ కే గఫూర్ విమానయాన రంగంలో కెరీర్‌ వెతుక్కోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిలను ఆకట్టుకునేందుకు ఒక కుక్కను కొనుగోలు చేస్తారు. దానికి ముద్దుగా నెయ్‌మార్‌ అని పేరు పెడతారు. ఆ కుక్క కారణంగా వారు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారన్నదే మూవీ కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్
ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.7 లక్షల బీమా..నామినీ ఖాతాలోకి
ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.7 లక్షల బీమా..నామినీ ఖాతాలోకి
కవిత కొత్త పార్టీకి షాక్ తప్పదా..?
కవిత కొత్త పార్టీకి షాక్ తప్పదా..?