Tulsi Plant Vastu Tips: ఇంట్లో తులసి మొక్క చుట్టూ ఈ మొక్కలు ఉన్నాయా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..

వాస్తుశాస్త్రం ప్రకారం, అటువంటి చెట్లు, మొక్కలను తులసి దగ్గర పెంచడం వల్ల ప్రతికూలతను పెంచుతుంది. అలాగే, వాస్తు ప్రకారం ఇంట్లో శమీ మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ తులసి మొక్కకు దగ్గరగా మాత్రం పెంచుకోరాదు. మీరు మీ ఇంట్లో షమీ, తులసి రెండు మొక్కలు నాటినట్లయితే, రెండింటికీ మధ్య కనీసం 4-5 అడుగుల దూరం ఉండాలని గుర్తుంచుకోండి. తులసి, శమీ మొక్కలను సమీపంలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.

Tulsi Plant Vastu Tips: ఇంట్లో తులసి మొక్క చుట్టూ ఈ మొక్కలు ఉన్నాయా..?  అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..
Tulsi Plant Vastu
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 09, 2023 | 7:16 AM

Tulsi Plant Vastu Tips: హిందూ మతంలో ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ఉన్న చోట కొన్ని చెట్లు, మొక్కలు పెట్టకూడదని వాస్తు చెబుతోంది. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. తులసి మొక్క ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. పచ్చని తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే, ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. తులసి మొక్కకు సంబంధించి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అందులో భాగంగా తులసి దగ్గర ఉంచకూడని కొన్ని చెట్లు, మొక్కలు కూడా ఉన్నాయి. అలాంటి మొక్కలను ప్రత్యేకించి వాస్తు శాస్త్రం పేర్కొంది.

తులసి -రావి చెట్టు రెండూ హిందూమతంలో పవిత్రమైనవి. పూజలందుకునేవి. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం, రావి చెట్టు- తులసిని ఎప్పుడూ దగ్గరగా నాటకూడదు. ఎందుకంటే ఇంట్లో తులసి మొక్కను ఉంచడం ఆనందానికి, ఐశ్వర్యానికి చిహ్నంగా సూచిస్తారు. కానీ, ఇంట్లో రావి చెట్టును పెంచడం వల్ల సంపద నష్టం కలుగుతుందన్నారు. అలాగే తులసి చుట్టూ ముళ్ల చెట్లు, ముళ్ల మొక్కలు ఉండకూడదని గుర్తుంచుకోండి. తులసి చుట్టూ ముళ్ల చెట్లను, మొక్కలను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూలత త్వరగా పెరిగి దురదృష్టం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే,తులసి మొక్కకు దగ్గరగా తెల్లటి పాలుగారే చెట్లను పొరపాటున కూడా పెంచకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం, అటువంటి చెట్లు, మొక్కలను తులసి దగ్గర పెంచడం వల్ల ప్రతికూలతను పెంచుతుంది. అలాగే, వాస్తు ప్రకారం ఇంట్లో శమీ మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ తులసి మొక్కకు దగ్గరగా మాత్రం పెంచుకోరాదు. మీరు మీ ఇంట్లో షమీ, తులసి రెండు మొక్కలు నాటినట్లయితే, రెండింటికీ మధ్య కనీసం 4-5 అడుగుల దూరం ఉండాలని గుర్తుంచుకోండి. తులసి, శమీ మొక్కలను సమీపంలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇంకా, కాక్టస్ వంటి ముళ్ళతో కూడిన మొక్కలు కూడా తులసికి దగ్గరగా నాటకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది ఇంటికి మంగళకరమైనదిగా కాదు. కాక్టస్ మొక్కను రాహువు చిహ్నంగా భావిస్తారు. అందుకే తులసి మొక్క చుట్టూ ఇలాంటి ముళ్లు కలిగిన మొక్కలు నాటకూడదు.

గమనిక: పైన పేర్కొన్న కథనం ప్రజల ఆచారాలు, మత విశ్వాసాలు, వేద పండితులు తెలిపిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..