Watch: దేవుడా..! ఇలాంటి భార్య నుంచి నన్ను రక్షించు..!! విమానంలో గొడవపడ్డ దంపతులు.. పాపం ఆ భర్త..

ఆమె తన భర్త ప్రవర్తనకు చిరాకు చెందుతుంది. ఈ జంట చేసిన వింత ప్రవర్తనకు విమానంలోని ప్రయాణికులందరి దృష్టి వీళ్లపైనే పడింది. అందరూ తిరిగి వీళ్ల వైపై చూస్తున్నారు. ఈ సమయంలో ఫ్లైట్‌లో కూర్చున్న ఎవరో వీడియో తీశారు. వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

Watch: దేవుడా..! ఇలాంటి భార్య నుంచి నన్ను రక్షించు..!! విమానంలో గొడవపడ్డ దంపతులు.. పాపం ఆ భర్త..
Wife Hit Husband In Flight
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 08, 2023 | 12:09 PM

భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం, ప్రేమ, గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. కానీ, ఈ సంబంధంలో కొన్ని చేదు, తీపి అనుభవాలు కూడా ఉన్నాయి. నిజానికి భార్యాభర్తల మధ్య బంధం గిల్లి కజ్జాలు లేకపోతే, అది అసంపూర్తిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దంపతుల మధ్య జరిగే స్వీట్ ఫైట్ నుంచి ప్రేమ పెరుగుతుందని అంటారు. అయితే, ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి గొడవగా మారితే బంధం తెగిపోతుంది. కానీ చిన్నపాటి వాదనను ఎప్పుడూ తీవ్రమైనదిగా మారకుండా జాగ్రత్తగా ఉంటేనే ఆ జంటకు అందం. అయితే, కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యతో వాదించడం అంటే చాలా మంది భర్తలు భయంతో పారిపోతారు. ప్రతి భర్త తన భార్యకు ఏ విషయంలోనూ కోపం రావొద్దు దేవుడా అని కోరుకుంటాడు..తన మానసిక స్థితి బాగుండాలని కోరుకుంటాడు..ఆమెకు కోపం, చిరాకు రాకుండా ఉండేలా చూస్తాడు.

కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. ఎప్పుడూ గొడవలు జరగని జంటలు బహుశా అరుదు అనే చెప్పాలి. అయితే, విమానంలో ఇలా జరిగితే, భర్త ఆ ఏం చేస్తాడు? తాజాగా అలాంటి సందర్భమే ఒకటి కనిపించింది. ఈ వీడియో చూశాక ఇలా ఎవరైనా చేస్తారా..? అని ముక్కున వెలేసుకుంటారు. వైరల్‌ వీడియోలో ఓ జంట ఫ్లైట్‌లో గొడవపడటం మొదలుపెట్టింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో, ఒక జంట విమానంలో ప్రయాణిస్తుండటం కనిపించింది. ఇంతలో భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవ జరుగుతుంది. ఇద్దరి మద్య నెలకొన్న వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది…ఇద్దరి మద్య గొడవ ఎంతలా ముదిరిందంటే..అతడు తన భార్యను చెప్పుతో కొట్టేందుకు సిద్ధపడగా…ఆమె చేయి పైకెత్తి అతనిపై దాడి చేయబోతుంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త వెంటనే ఎయిర్ హోస్టెస్ సహాయం కోసం కేకలు వేస్తూ నా భార్య గొడవ పడుతోంది. ప్లీజ్ నన్ను కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరిచాడు. ఇంతలో ఫ్లైట్‌లో కూర్చున్న వాళ్ళు షాక్ అయ్యి నవ్వడం మొదలుపెట్టారు. కొంతమంది ప్రయాణీకులు పగలబడి పెద్దగా నవ్వుకోవటం వీడియోలో కనిపించింది.

View this post on Instagram

A post shared by Sunny Aryaa (@tehelkaprank)

ఎయిర్ హోస్టెస్ సహాయం కోసం భర్త అరవడంతో, భార్య కూడా తన చేతులతో నోటిని మూసేసుకుని ఒకింత సిగ్గుపడుతున్నట్టుగా, ముసి ముసిగా నవ్వుకుంటుంది. ఆమె తన భర్త ప్రవర్తనకు చిరాకు చెందుతుంది. ఈ జంట చేసిన వింత ప్రవర్తనకు విమానంలోని ప్రయాణికులందరి దృష్టి వీళ్లపైనే పడింది. అందరూ తిరిగి వీళ్ల వైపై చూస్తున్నారు. ఈ సమయంలో ఫ్లైట్‌లో కూర్చున్న ఎవరో వీడియో తీశారు. వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..