Watch Video: వాక్‌ తూ..! కమ్మని కాఫీ… ఈ జంతువు మలవిసర్జన నుండి తయారు చేస్తారట.. కప్పు కాఫీ ధర తెలిస్తే కళ్లు బైర్లే..!

ఈ కాఫీ కప్పు ధర రూ. 6000 లవరకు ఉంటుంది. కాఫీ గింజలు ఆ జంతువు పేగుల గుండా వెళ్ళిన తర్వాత, కాఫీ బీన్స్‌లోని ప్రోటీన్ కూర్పు మారుతుందని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక పేర్కొంది. కాఫీ అసిడిటీని కూడా తొలగిస్తుంది. చాలా మంచి కాఫీ తయారవుతుంది. ఈ కాఫీని సామాన్యుల కాఫీ అని కాదు, ధనికుల కాఫీ అని అంటారు.

Watch Video: వాక్‌ తూ..! కమ్మని కాఫీ... ఈ జంతువు మలవిసర్జన నుండి తయారు చేస్తారట.. కప్పు కాఫీ ధర తెలిస్తే కళ్లు బైర్లే..!
Kopi Luwak F
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 08, 2023 | 9:45 AM

చాలా మందికి కాఫీ అంటే చాలా ఇష్టం. సరికొత్త కాఫీ రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తారు. అత్యంత ఖరీదైన కాఫీ ఏది..? దానిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యంతో కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! ఈ అత్యంత ఖరీదైన కాఫీ పేరు కోపి లువాక్. ఈ కాఫీ కప్పు ధర రూ. 6000 లవరకు ఉంటుంది. ఈ కాఫీని ఆసియా దేశాలతో సహా దక్షిణ భారతదేశంలో ఉత్పత్తి చేస్తారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కాఫీని పిల్లి మలం నుండి తయారు చేస్తారు.

చాలా అరుదైన పిల్లి జాతి..

ఈ కాఫీని సివెట్ క్యాట్ మలంతో తయారు చేస్తారు. కాబట్టి దీనిని సివెట్ కాఫీ అని కూడా పిలుస్తారు. ఈ పిల్లికి కోతిలాగా పొడవాటి తోక ఉంటుంది. ఈ పిల్లి పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో ముఖ్యమైన సహకారం అందిస్తుంది. పిల్లి మలం నుండి కాఫీని ఎలా తయారు చేస్తారని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ సివెట్ పిల్లికి కాఫీ గింజలు తినడం చాలా ఇష్టం. ఇది కాఫీ చెర్రీలో సగం మాత్రమే తింటుంది. చెర్రీస్ జీర్ణమయ్యేవి. కానీ పిల్లులు వాటిని పూర్తిగా జీర్ణం చేసుకోలేవు.. ఎందుకంటే వాటి ప్రేగులలో జీర్ణ ఎంజైములు ఉండవు.. సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల, జీర్ణం కాని భాగం పిల్లి మలంలో విసర్జించబడుతుంది.

కాఫీ తయారు చేసే విధానం..

జీర్ణం కాని కాఫీ గింజలు మలం నుండి తొలగించి.. క్రిములు లేకుండా శుద్ధి చేస్తారు. ఆ కాఫీ గింజలను శుభ్రంగా కడిగి, బాగా ఆరబెట్టి మెత్తగా పొడి చేసి కాఫీ తయారు చేస్తారు. ఇలా కాఫీ గింజలు పిల్లి పేగుల గుండా వెళ్ళిన తర్వాత, అవి జీర్ణ ఎంజైమ్‌లతో కలిసి కాఫీని మెరుగ్గా, మరింత పోషకమైనవిగా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్రజలు ఈ కాఫీని ఎందుకు ఇష్టపడతారు..

కాఫీ గింజలు పిల్లి పేగుల గుండా వెళ్ళిన తర్వాత, కాఫీ బీన్స్‌లోని ప్రోటీన్ కూర్పు మారుతుందని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక పేర్కొంది. కాఫీ అసిడిటీని కూడా తొలగిస్తుంది. చాలా మంచి కాఫీ తయారవుతుంది. ఈ కాఫీని సామాన్యుల కాఫీ అని కాదు, ధనికుల కాఫీ అని అంటారు.

ఇండోనేషియాలో కాఫీ ఉత్పత్తి..

ఈ కాఫీ భారతదేశంలోని కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో కూడా ఉత్పత్తి చేస్తారు. ఇండోనేషియా, ఆసియాలో అత్యధిక కాఫీని ఉత్పత్తి చేస్తుంది. ఇండోనేషియా ఒక పర్యాటక దేశంగా మారుతోంది. ఈ కాఫీ ఉత్పత్తి ప్రక్రియ కోసం ఈ దేశంలోని అడవి పిల్లుల సివెట్ జాతులను బంధి ఉంచుతారు. కాఫీ గింజలను తయారుచేసే ప్రక్రియ కాఫీ తోటల చుట్టూ జరుగుతుంది. సందర్శకులను కూడా సైట్ పర్యటనకు తీసుకువెళతారు. ఇండోనేషియా కాఫీ ఉత్పత్తిని పెంచడమే కాకుండా, పర్యాటకాన్ని పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

జంతు హక్కుల సంస్థలు దీనిని విపత్తుగా ప్రకటించాయి. లండన్‌కు చెందిన యానిమల్ ప్రొటెక్షన్ అనే సంస్థ జరిపిన పరిశోధనలో 16 కాఫీ తోటల్లో అనేక సివెట్ పిల్లులు బందీలుగా ఉన్నట్లు గుర్తించారు. మూగ జంతువులను రుచి కోసం హింసిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.