Rs.2000 Notes Exchange: రెండు వేల నోట్ల మార్పుపై RBI మరో కీలక ప్రకటన.. ఈ విషయం తప్పకుండా గమనించండి..
RBI Alert: రూ. 2000 నోట్లపై ఆర్బీఐ మరో ప్రకటన చేసింది. మార్చుకుందాం లే.. మరో రోజు చూద్దాం లే.. సమయం ఉందిగా.. అనుకుంటూ సాగదీయకుండా వెంనటే ఈ పని చేాయాలని ఆర్బీఐ సూచన చేసింది. మీ సమీపంలోని బ్యాంకు ప్రతి రోజు తెరిచి ఉండదు.. దాని పని దినాలను చూసుకుని వెల్లండని సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఇది వచ్చే నెల సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. మీ దగ్గర 2 వేల నోట్లు ఉన్నాయా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

పింకు నోటంటే మాటలా.. ఒక్కో నోటు విలువ రెండు వేల రూపాయలు..ఒక్క నోటు దగ్గరుంటే ఎన్ని పనులు చక్కబెట్టవచ్చో..పాపం.. వచ్చిన ఆరేళ్లకే అడ్రస్ లేకుండా పోతోంది.. అందరినీ మురిపించి.. అందరి కళ్లలో ఆనందం చూసిన పింకు నోటు బై.. బై చెబుతోంది. సెప్టెంబర్ 30 తర్వాత ఎక్కడా కనిపించదు.. ఆగస్టులో సుదీర్ఘ బ్యాంకు సెలవులతో పాటు, సెప్టెంబర్ నెలలో కూడా సుదీర్ఘ సెలవులు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీ వద్ద ఇంకా 2000 రూపాయల నోటు ఉంటే.. వీలైనంత త్వరగా బ్యాంకులో డిపాజిట్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఇది వచ్చే నెల సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది.
రూ. 2000 నోట్ల చలామణిని తొలగించిన తర్వాత వాటిని మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి చాలా మంది బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి కొంత సమయం ఇచ్చింది. రూ. 2000 డినామినేషన్‌లోని బ్యాంక్‌నోట్లను తప్పనిసరిగా సెప్టెంబర్ 30, 2023లోగా మార్చుకోవాలి లేదా డిపాజిట్ చేయాలి. కాబట్టి, మీరు ఇంకా రాబోయే నెలల్లో డిపాజిట్ చేయాలనుకుంటే.. మీకు సమీపంలోని బ్యాంకును వెళ్లి మార్చుకోవాలి.. అంతకంటే ముందు బ్యాంకు సెలవులను జాగ్రత్తగా చెక్ చేయండి.
మే 19, 2023న విడుదల చేసిన ఆర్‌బిఐ పత్రికా ప్రకటన ప్రకారం.. రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి కోసం సదుపాయం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. రూ.2000 నోట్లను మార్చుకునే సదుపాయం ఉంటుంది.
2000 నోటు మార్చుకోవడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్
రూ. 2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి.. ఈ నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి చాలా మంది బ్యాంకులను సంప్రదిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఇది వచ్చే నెల సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి, రూ. 2000 నోట్లను 30 సెప్టెంబర్ 2023లోగా మార్చాలి లేదా డిపాజిట్ చేయాలి. కాబట్టి, మీరు ఇంకా రాబోయే నెలల్లో డిపాజిట్లు చేయాలనుకుంటే.. బ్యాంకు సెలవుల తేదీలను జాగ్రత్తగా చూసుకోవాలి.
ఈ నెల ఆగస్టు 2023లో బ్యాంక్ సెలవుల జాబితా..
ఆగస్టు నెలలో అనేక పండుగలు, పండుగలు, రోజులు వస్తాయి. ఆ రోజుల్లో బ్యాంక్ సెలవులు (ఆగస్టు 2023లో బ్యాంక్ సెలవులు) నిర్వహించబడతాయి. అయితే, ఈ సెలవుదినం రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారవచ్చు.
- ఆగస్టు 12 (శనివారం) – నెలలో రెండవ శనివారం కారణంగా, బ్యాంకులు పనిచేయవు.
- ఆగస్టు 13 (ఆదివారం) – వారపు సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఆగస్టు 15 (మంగళవారం) – స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
- ఆగష్టు 16 (బుధవారం) – పార్సీ నూతన సంవత్సరం (షాహెన్‌షాహి) సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఆగస్టు 18 (శుక్రవారం) – శ్రీమంత శంకరదేవ తేదీ కారణంగా అస్సాంలో బ్యాంకులు మూతపడనున్నాయి.
- ఆగస్టు 20 (ఆదివారం) – వారపు సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఆగస్టు 26 (శనివారం) – నెలలో నాలుగో శనివారం కారణంగా బ్యాంకుల్లో పనులు బంద్.
- ఆగస్టు 27 (ఆదివారం) – వారపు సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఆగస్టు 28 (సోమవారం) – మొదటి ఓనం సందర్భంగా కేరళలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఆగస్టు 29 (మంగళవారం) – తిరువోణం సందర్భంగా కేరళలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఆగస్టు 30-(బుధవారం)- రక్షా బంధన్ సందర్భంగా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఆగస్ట్ 31 – (గురువారం) – రక్షా బంధన్, శ్రీ నారాయణ్ గురు జయంతి, పాంగ్-లాబ్సోల్ సందర్భంగా ఉత్తరాఖండ్, అస్సాం, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
సెప్టెంబర్ 2023లో బ్యాంక్ సెలవులు..
ఆర్బీఐ ప్రకారం, సెప్టెంబర్ 2023లో 15 రోజుల కంటే ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండబోతున్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. కృష్ణ జన్మాష్టమి, వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి, నుఖాయ్, శ్రీ నారాయణ గురు సమాధి దినం, మహారాజా హరిసింగ్ జయంతి, శ్రీమంత్ శంకర్‌దేవ్ జన్మోత్సవ్, మిలాద్-ఎ-షరీఫ్ (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం