Viral Video: టీ తాగుతున్న బల్లి..? ఒక్కో సిప్‌ ఎంజాయ్‌ చేస్తూ.. వీడియో చూస్తే అవాక్కే..!

దాదాపు అన్ని జంతు జాతులు, కొన్ని క్రిమికీటకాదులు వంటివి మనుషులు తినే ఆహారాన్ని తింటాయని మనకు తెలుసు. అయితే రిఫ్రెష్‌మెంట్ కోసం మనం తాగే కొన్ని డ్రింక్స్‌ని కూడా అవి ఎంజాయ్ చేసి తాగుతాయా..? అంటే ఈ వీడియో చూస్తే అవును అనే అనిపిస్తుంది. వైరల్‌ అవుతన్న వీడియోలో ఓ ఇంట్లోని వారు ఒక గ్లాసులో టీ పోసి పక్కన పెట్టారు. ఆ టీ గ్లాసుపట్టుకుని నిలబడి ఉన్న బల్లి ఒకటి హాయిగా ఆ టీ తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంది.

Viral Video: టీ తాగుతున్న బల్లి..? ఒక్కో సిప్‌ ఎంజాయ్‌ చేస్తూ.. వీడియో చూస్తే అవాక్కే..!
Lizard Drinking Tea
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 08, 2023 | 7:38 AM

కొంతమందికి పొద్దున లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే టీ తాగపోతే వారికి పొద్దు గడవదు. మరి కొంతమందికి సాయంత్రం టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కొందరికి టైమ్‌తో పనుండదు. గంటా రెండు గంటలకోసారి ఒక కప్పు టీ కడుపులో పడందే ఉండలేరు. అలా రోజులో ఎన్ని కప్పుల చాయ్‌ తాగుతారో కూడా లెక్క తెలియకుండానే తాగేస్తుంటారు. టీ లవర్స్ ఒక్కో సిప్ చేస్తూ ఎంజాయ్ చేయడం చూస్తే ఎలాంటి వారికైనా సరే వెంటనే గరం గరం చాయ్‌ ఒకటి తాగేయాలనిపిస్తుంది. అయితే, కేవలం మనుషులు మాత్రమే కాదు.. ఇప్పుడు బల్లులు కూడా టీ లవర్స్‌గా మారిపోతున్నారు. అవును మీరు చదివింది నిజమే..! బల్లి టీ తాగుతుంది..!! నమ్మలేకపోతున్నారు కాదా.. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో బల్లి టీ తాగుతూ ఎలా ఎంజాయ్ చేస్తుందో చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

దాదాపు అన్ని జంతు జాతులు, కొన్ని క్రిమికీటకాదులు వంటివి మనుషులు తినే ఆహారాన్ని తింటాయని మనకు తెలుసు. అయితే రిఫ్రెష్‌మెంట్ కోసం మనం తాగే కొన్ని డ్రింక్స్‌ని కూడా అవి ఎంజాయ్ చేసి తాగుతాయా..? అంటే ఈ వీడియో చూస్తే అవును అనే అనిపిస్తుంది. వైరల్‌ అవుతన్న వీడియోలో ఓ ఇంట్లోని వారు ఒక గ్లాసులో టీ పోసి పక్కన పెట్టారు. ఆ టీ గ్లాసుపట్టుకుని నిలబడి ఉన్న బల్లి ఒకటి హాయిగా ఆ టీ తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా వీక్షిస్తున్నారు. బల్లులు పురుగులను తినడం చూశాం. కానీ, ఇలా ఈ వీడియోలో బల్లి ఆనందంగా కూర్చుని టీ తాగుతూ కనిపించటం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.. బల్లి తన రెండు కాళ్లపై నిలబడి కప్పులోని టీ కోసం నాలుక చాచి.. సిప్ చేసి తాగడం ప్రారంభించింది. ఆ కప్పులోని టీని ఎవరికీ తెలియకుండా తన చిన్న నోటితో ఆస్వాదిస్తూ తాగుతోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా సైట్‌లలో బల్లి వీడియో వైరల్ అవుతోంది.

వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేశారు. కొందరు బల్లి వారి ఫ్యామిలీ మెంబర్ అంటున్నారు..? మరికొందరు అలాగే చూస్తూ ఊరుకుంటే.. ఇతర తినే ఆహారా పదార్థాల్లోనూ బల్లి చేరే ప్రమాదం ఉంటూ కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి బల్లుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..