AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Making Of Black Salt: బ్లాక్‌ సాల్ట్‌ ఎలా తయారు చేస్తారో తెలిస్తే.. వైరలవుతున్న వీడియో..

మరికొందరు కూలీల శ్రమను ప్రశంసించారు. మొదటిసారిగా నల్ల ఉప్పు తయారు చేయడం చూశాం అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌ అవుతోంది. దీనిని చాలా నెటిజన్లు ఉత్సుకతతో చూస్తున్నారు. ఈ ఉప్పు భారతదేశంలోనే తయారవుతుందని మీకు తెలుసా..? బ్లాక్‌ సాల్ట్‌ని ఎలా తయారు చేస్తారో చూపించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Making Of Black Salt: బ్లాక్‌ సాల్ట్‌ ఎలా తయారు చేస్తారో తెలిస్తే.. వైరలవుతున్న వీడియో..
Making Of Black Salt
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2023 | 2:30 PM

Making Of Black Salt: చిటికెడు ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. కానీ ఉప్పు తయారీ పని ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. తెల్ల ఉప్పు అయినా, నల్ల ఉప్పు అయినా కూలీలు కష్టపడి శరీరాన్ని కాల్చుకోవాలి. అలాంటి కష్టమైన పనిలో ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. గుజరాత్ నుండి రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర వరకు ఉప్పు తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. అయితే బ్లాక్ సాల్ట్ తయారు చేయడం ఎప్పుడైనా చూశారా? నిజానికి, బ్లాక్ సాల్ట్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇది పాకిస్థాన్ నుంచి వస్తుందని కొందరు అంటుంటే, పర్వతాల నుంచి తెప్పించారని మరి కొందరు అంటున్నారు. కానీ, ఈ ఉప్పు భారతదేశంలోనే తయారవుతుందని మీకు తెలుసా..? బ్లాక్‌ సాల్ట్‌ని ఎలా తయారు చేస్తారో చూపించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నల్ల ఉప్పు తయారు చేయడం అంత సులభం కాదు. దీన్ని తయారు చేయడంలో శ్రమతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వైరల్ వీడియోలో మొదటగా సాంభార్ ఉప్పు (సాంభార్ సరస్సు నుండి) ట్రక్కు నుండి దించడం కనిపింస్తుంది. ఇది తెల్లటి ముతక ఉప్పు, ఇది జైపూర్ నుండి వస్తుంది. అన్నింటిలో మొదటిది కొలిమిలో చాలా పేడ పిడకలు వేసి మంట పెడతారు. దీని తరువాత అందులో చాలా బొగ్గు కూడా వేస్తారు. తర్వాత కొలిమిలో మట్కాలు వేసి పైన బొగ్గు పోస్తారు. తద్వారా ఖాళీ స్థలం ఉండదు. దీని తరువాత, కుండలలో తెల్ల ఉప్పు నింపబడుతుంది. అలాగే, బాదం తొక్క కలుపుతారు, ఇది ఉప్పు రంగును మారుస్తుంది. మట్కాలను పూర్తిగా ఇటుకలతో కప్పిన తర్వాత, వాటిని 24 గంటలు ఉడికించాలి. నిప్పుతో చేసిన బాల్స్‌ని కొలిమిలోంచి బయటకు తీసి చల్లారిన తర్వాత దాన్ని పగలగొట్టి నల్ల ఉప్పును బయటకు తీస్తారు.

ఈ వీడియో Instagram పేజీ Foodie Incarnate నుండి పోస్ట్ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌లో మేకింగ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్… ఇలా బ్లాక్ సాల్ట్ తయారు చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక, ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 38 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 17 వేల లైక్‌లు వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు దీనిపై స్పందించారు కూడా. ఒక వ్యక్తి రాశాడు – కొదరు ఆ కార్మికుల శ్రమను గుర్తిస్తే.. మరికొందరు చెప్పులు వేసుకుని తొక్కుతున్నారు..ఈ ఉప్పు ఎవరు తింటారని అంటుంటే..మరికొందరు కూలీల శ్రమను ప్రశంసించారు. మొదటిసారిగా నల్ల ఉప్పు తయారు చేయడం చూశాం అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌ అవుతోంది. దీనిని చాలా నెటిజన్లు ఉత్సుకతతో చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ను అమర్ సిరోహి (@foodie_incarnate) అనే యూజర్‌ షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..