AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తెలివైన దొంగ..చాకచక్యంగా కుక్కను మచ్చిక చేసుకుని కాస్ట్‌లీ సైకిల్‌ చోరీ

ఈ వీడియోలో ఓ ఇంటి ముందు కొన్ని సైకిళ్లు పార్క్‌ చేసి ఉన్నాయి. అక్కడికి ఓ యువకుడు బ్యాగ్‌ తగిలించుకొని వచ్చాడు. అక్కడున్న కాస్ట్‌లీ సైకిల్‌ తీసుకొని వెళ్లబోయాడు. ఇంతలో ఆ ఇంట్లోంచి ఓ కుక్క పరుగెత్తుకొచ్చింది. వచ్చీ రాగానే కొత్త వ్యక్తి దగ్గరకు వెళ్లింది. అయితే దొంగ కొంచెం తెలివిగా ఆలోచించాడు.పారిపోతే కుక్క చేసే హడావిడికి చుట్టుపక్కల ఉన్నవారు వస్తారని లేదా అది తన పిక్క ని పట్టుకుంటుందని ఆలోచించాడేమో.

Viral Video: తెలివైన దొంగ..చాకచక్యంగా కుక్కను మచ్చిక చేసుకుని కాస్ట్‌లీ సైకిల్‌ చోరీ
Pacific Beach Bike Thief
Surya Kala
|

Updated on: Aug 08, 2023 | 1:18 PM

Share

మారుతున్న కాలంతో పాటు దొంగలు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. ఇంతకు ముందు ఎక్కడైనా చోరీకి వెళ్లినప్పుడు అక్కడ కుక్కలుంటాయేమోనని భయపడేవారు. అపరిచితులు, దొంగను చూసి మొరిగే కుక్కలు ఎక్కువ. కొన్ని సార్లు అయితే వీధి కుక్కలు మాత్రమే కాదు.. పెంపు కుక్కలు కూడా దొంగలను చూసి అరవడం మాత్రమే కాదు.. వీలయితే పిక్కను దక్కించుకుని మాంసం ముక్కని రుచిస్తాయి కూడా.. అందుకే చోరీకి వెళ్లిన చోట కుక్క అరుపు వినగానే దంగలు వెనక్కి తిరిగిచూడకుండా పరుగెడతారు. కానీ, ఇక్కడ సీన్ వేరు. వీడు శునకాలను కూడా తన స్నేహంతో బురిడీకొట్టించగల నేర్పరి దొంగ. అందుకే తనకు కావలసిన కాస్ట్‌లీ సైకిల్‌ను ఎంతో చాకచక్యంగా ఎత్తుకెళ్లిపోయాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. స్పాట్‌..

ఈ వీడియోలో ఓ ఇంటి ముందు కొన్ని సైకిళ్లు పార్క్‌ చేసి ఉన్నాయి. అక్కడికి ఓ యువకుడు బ్యాగ్‌ తగిలించుకొని వచ్చాడు. అక్కడున్న కాస్ట్‌లీ సైకిల్‌ తీసుకొని వెళ్లబోయాడు. ఇంతలో ఆ ఇంట్లోంచి ఓ కుక్క పరుగెత్తుకొచ్చింది. వచ్చీ రాగానే కొత్త వ్యక్తి దగ్గరకు వెళ్లింది. అయితే దొంగ కొంచెం తెలివిగా ఆలోచించాడు.పారిపోతే కుక్క చేసే హడావిడికి చుట్టుపక్కల ఉన్నవారు వస్తారని లేదా అది తన పిక్క ని పట్టుకుంటుందని ఆలోచించాడేమో.. దీంతో ఆ దొంగ.. పారిపోవడం కంటే కుక్కను తన దారికి తెచ్చుకోవాలని భావించాడు.

ఇవి కూడా చదవండి

వెంటనే సైకిల్ ను తిరిగి ముందున్న చోటే పార్క్ చేసి, శునకాన్ని దగ్గరకు తీసుకున్నాడు. అది మాత్రం అతడ్ని విడిచి పెట్టడం లేదు. దాన్ని కాసేపు ముద్దుచేసి, నీకు పెట్టడానికి నాదగ్గర ఏమీలేవు.. ఈసారి వచ్చినప్పుడు తెస్తాను అన్నట్టుగా ఖాళీ చేతులు ఆ కుక్కకు చూపించి, మొత్తానికి దాన్ని వదిలించుకుని సైకిల్ ను తీసుకుని వెళ్లిపోయాడు. అతడినే చూస్తూ ఇంటి గుమ్మం దగ్గరే శునకం ఆగిపోయింది. అలా చూస్తూ ఉన్నట్టుండి మళ్లీ అతను వెళ్లిన వైపు పరుగు లంకించుకుంది శునకం. దొంగను ఆ కుక్క పట్టుకుందో లేదో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను శాన్ డియాగో పోలీసులు తమ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. 2019 సంవత్సరానికి చెందిన బ్లాక్ ఎలెక్ట్రా 3 స్పీడ్ సైకిల్ చోరీకి గురైనట్టు గుర్తించారు. దాని ధర 1,300 డాలర్లు ఉంటుందని ప్రకటించారు. దొంగ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..