AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumar Sanu: అభిమానం ఉంటే అంతే.. 1200 కి.మీ. సైకిల్ మీద ప్రయాణం చేసి తన అభిమాన సింగర్ కుమార్ సాను కలిసిన యువకుడు..

ప్రస్తుతం ఆ యువ అభిమానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వైరల్ భయానీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఒక యువకుడు కుమార్ సానును చూసిన వెంటనే.. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాదు కుమార్ సాను పాదాలను తాకి, కౌగిలించుకున్నాడు. తన అభిమానిని కలిసిన తర్వాత కుమార్ సాను కూడా సంతోషపడినట్లు వీడియో తెలుస్తోంది. 

Kumar Sanu: అభిమానం ఉంటే అంతే.. 1200 కి.మీ. సైకిల్ మీద ప్రయాణం చేసి తన అభిమాన సింగర్ కుమార్ సాను కలిసిన యువకుడు..
Kumar Sanu Fan Rakesh
Surya Kala
|

Updated on: Aug 06, 2023 | 1:19 PM

Share

బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను సాంగ్స్ ను ఇష్టపడని వారు బహు అరుదని చెప్పవచ్చు. కుమార్ సాను  ఇప్పుడు ఎక్కువగా పాటలు పాడడం లేదు కానీ.. 1990లో మాత్రం స్టార్ సింగర్.. కుమార్ సాను సాంగ్స్ అంటే అప్పట్లో ఓ రేంజ్ లో క్రేజ్.. అయితే అప్పటి క్రేజ్ ఇపప్పటికీ ఉందని అనేక సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. నేటికీ వేదికపై ఎక్కడ మైక్ పట్టుకున్నా కుమార్ సాను తన గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఈ గాయకుడు తన కెరీర్‌లో చాలా పాటలు పాడాడు.. అవార్డులతో పాటు రివార్డ్స్ ను కూడా గెలుచుకున్నాడు. కుమార్ సాను 80, 90 లతో పాటు 2000ల ప్రారంభంలో పాటలు పాడాడు.. తన మధురమైన గాత్రంతో అందరినీ ప్రేమలో పడేలా చేశాడు. అతని గాత్రంలోని మ్యాజిక్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మైక్ పట్టుకుని గొంతు సవరించుకుంటే చాలు సంగీత ప్రియులు ఫిదా అంటారు. తనకు కుమార్ సానుపై ఉన్న అభిమానాన్ని చాటి చెబుతూ.. ఆయన్ని కలిసేందుకు ఓ యువకుడు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ  వచ్చాడు.

ప్రస్తుతం ఆ యువ అభిమానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వైరల్ భయానీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఒక యువకుడు కుమార్ సానును చూసిన వెంటనే.. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాదు కుమార్ సాను పాదాలను తాకి, కౌగిలించుకున్నాడు. తన అభిమానిని కలిసిన తర్వాత కుమార్ సాను కూడా సంతోషపడినట్లు వీడియో తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆ అభిమాని పేరు రాకేష్ బలోడియా. తన అభిమాన లెజెండరీ సింగర్ కుమార్ సాను అంటే రాకేష్ అంటే చాలా ఇష్టం. రాజస్థాన్‌లోని ఝుంఝును నుంచి బయలుదేరి 1200 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై ప్రయాణించి ముంబై చేరుకున్నాడు. ముంబై చేరుకున్న తర్వాత కుమార్ సానును కలిశాడు. రాకేష్ రెండు ధరించిన టీ షర్ట్ పై ముందు, వెనుక కుమార్ సాను పేరు, కుమార్ సాను చిత్రం కనిపించింది.

అభిమాని వీడియో

సూపర్ స్టార్స్ కు గాత్రం ఇచ్చిన కుమార్ సాను..

కుమార్ సాను గురించి మాట్లాడితే.. గత 4 దశాబ్దాలుగా సినిమాల్లో పాటలు పాడుతున్నారు.  అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్ వంటి స్టార్స్ కు అనేక సూపర్ హిట్ సాంగ్స్ ను ఇచ్చారు . ముఖ్యంగా కుమార్ సాను వాయిస్ ..  షారుఖ్ ఖాన్ పాటలకు అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరు. కుమార్ సాను తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు .

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us