Horoscope Today: ఈ రాశివారికి అనుకోని అదృష్టం వరించనుంది.. 12 రాశులవారి బుధవారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి..

Daily Horoscope(August 09): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 09, 2023న(బుధవారం)న 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today: ఈ రాశివారికి అనుకోని అదృష్టం వరించనుంది.. 12 రాశులవారి బుధవారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి..
Horoscope 08th August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: TV9 Telugu

Updated on: Aug 09, 2023 | 3:45 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రోజంతా మీరనుకున్నట్టే జరిగే అవకాశం ఉంది. గురు బలం కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగతంగా మీకు ఉద్యోగ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి. అనుకూలమైన వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల శుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యో గంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితంలో కొద్దిగా టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతుంటాయి. కొత్తవారు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమా చారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆదాయానికి మించి ఖర్చు పెరిగే సూచనలున్నాయి. తలపెట్టిన పనులు పూర్తి కావడానికి ఖర్చ వుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఏదో ఒక ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు ఉండ వచ్చు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను కూడా ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు, అవివాహితలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు , ఆలోచనలు కలిసివస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. కొత్త వారితో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారా లతో అత్యవసర వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): తండ్రి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. రాదనుకున్న డబ్బు కలిసి వస్తుంది. రోజంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యా నికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్య వర్తిగా వ్యవహరించి, వాటిని పరిష్కరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయ డం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలను కొన్నిటిని పరిష్కరించుకుంటారు. మొత్తం మీద రోజంతా క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పని సరిగా జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవ హారాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇంటా బయటా పని ఒత్తిడి బాగా ఉండే అవ కాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన కబుర్లు అందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. ముఖ్యమైన పనులు సునాయా సంగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయాలి.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి