55 ఏళ్ల వయసులో 30 కిలోలు తగ్గిన ఖుష్బూ.. 3 ఏళ్లలోనే ఇలాంటి లుక్..
Rajitha Chanti
Pic credit - Instagram
12 June 2026
కుష్బూ తన
అద్భుతమైన
బరువు తగ్గింపు ప్రయాణం గురించి అభిమానులతో పంచుకున్నారు. తన 55 ఏళ్ల వయస్సులోనూ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది.
ఎలాంటి వ్యాయామాలు లేకుండానే ఆమె మూడేళ్ల కాలంలో 32 కిలోల బరువు తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా తన డైట్ సీక్రెట్ వెల్లడించింది.
తాను బరువు తగ్గడానికి దాదాపు మూడేళ్లు పట్టిందని తెలిపింది. అనేక రకాల డైట్‌లు ప్రయత్నించినా, ఏ ఫ్యాడ్ డైట్ కూడా తనకు సరైన ఫలితాలను ఇవ్వలేదన్నారు.
తాను జిమ్‌కు వెళ్లే వ్యక్తిని కాదని, వ్యాయామశాలలో కసరత్తులు చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. తనకు నడవడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.
ప్రతిరోజూ ఉదయం 45 నిమిషాలు, సాయంత్రం 45 నిమిషాలు క్రమం తప్పకుండా నడవడం తన దినచర్యలో భాగమని ఆమె వివరించారు. ఎక్కడ ఉన్నా నడుస్తానని అన్నారు.
నిలకడగా నడవడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా మానసిక ఉల్లాసం, శక్తి స్థాయిలు కూడా మెరుగుపడతాయని.. అలాగే అహారపు అలవాట్లు కూడా అని వెల్లడించారు.
జంక్ ఫుడ్ పూర్తిగా మానేశారు. వేయించిన ఫుడ్, మసాలా ఆహారాలు, పుల్లటి పదార్థాలు సహజంగానే అంతగా నచ్చవని తెలిపారు. అలాంటి ఫుడ్ కు దూరంగా ఉందట.
అలాగే మానసిక ప్రశాంతత, నిద్ర కూడా బరువు తగ్గడంలో సాయపడిందని తెలిపారు. మూడేళ్ల కాలంలో దాదాపు 30 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచారు ఖుష్బూ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్