AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు.. అసలేం జరుగుతోంది?

Team India : 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కమ్యూనికేషన్ గ్యాప్‌పై చర్చ మొదలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు, గౌతమ్ గంభీర్ వ్యూహాలు, బీసీసీఐ పాత్రపై ఆసక్తికర కథనం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Team India : గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు.. అసలేం జరుగుతోంది?
Team India
Rakesh
|

Updated on: Jun 12, 2026 | 3:13 PM

Share

Team India : భారత క్రికెట్ జట్టు 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సన్నాహాలు ప్రారంభించాల్సిన కీలక సమయంలో.. డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. భారత వన్డే జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లేదా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను సంప్రదించకుండా, నేరుగా బీసీసీఐ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వన్డే ఫార్మాట్‌లో రాబోయే రోజుల్లో తమ పాత్ర ఏంటనే దానిపై స్పష్టత కోసమే వారు బోర్డు పవర్‌హౌస్‌లను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్ పరిణామం భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

వివాదానికి దారితీసిన కమ్యూనికేషన్ గ్యాప్

గత కొద్ది రోజులుగా వన్డే జట్టుకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలపై సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయ్యారు. కానీ, వారు 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలని ఆశిస్తున్నారు. అయితే, రాబోయే 16 నెలల కాలంలో టీమ్ మేనేజ్‌మెంట్ తమ నుంచి ఏం ఆశిస్తోంది? జట్టులో తమ స్థానం ఎంతవరకు సురక్షితం? అనే విషయాలపై కోచ్ గంభీర్ నుంచి వారికి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని సమాచారం. ఈ అనిశ్చితి వల్లే సీనియర్లు నేరుగా బోర్డు పెద్దలను సంప్రదించాల్సి వచ్చింది.

గంభీర్ శైలిపై బోర్డు అసంతృప్తి?

బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టెస్టులు, టీ20లపై చూపించినంత శ్రద్ధ వన్డే ప్లానింగ్‌పై చూపించడం లేదు. టీ20 ప్రపంచకప్ విజయం, ఆసియా కప్ గెలవడంలో గంభీర్ వ్యూహాలు అద్భుతంగా పనిచేసినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో మాత్రం జట్టు వరుస ఓటములను చవిచూసింది. గంభీర్ హయాంలో శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో భారత్ వన్డే సిరీస్‌లు ఓడిపోవడం బోర్డును కలవరపెడుతోంది. గంభీర్ వన్డే వ్యూహాలను వాటి మానాన అవే సాగనివ్వడం వల్లే డ్రెస్సింగ్ రూమ్‌లో గందరగోళం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు.

యంగ్ కెప్టెన్ గిల్‌కు అగ్నిపరీక్ష

రోహిత్ శర్మ స్థానంలో వన్డే పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‎కు ఇది పెద్ద అగ్నిపరీక్షగా మారింది. గిల్ కెప్టెన్సీలో భారత్ ఇంకా తొలి వన్డే సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంతమంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పుడు, గిల్ తన వాయిస్‌ను మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది. సీనియర్లను గౌరవిస్తూనే, జట్టు ప్రణాళికలను వారికి ఖచ్చితంగా వివరించడంలో గిల్, గంభీర్ ఇద్దరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది.

ధోనీ కాలం నాటి పాత రోజులు

భారత క్రికెట్‌లో ఇలాంటి సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా జట్టులో పరివర్తన ప్రక్రియ జరిగినప్పుడు ఇలాంటి వార్తలే వచ్చాయి. సీనియర్ ఆటగాళ్లను పక్కనబెట్టి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో అప్పట్లో కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు తలెత్తాయి. అయితే కాలక్రమేణా జట్టు విజయాలు సాధించడంతో ఆ వివాదాలు సద్దుమణిగాయి. ఇప్పుడు మళ్లీ 2027 వరల్డ్ కప్ నాటికి బలమైన జట్టును తయారు చేయాలంటే గంభీర్, గిల్, సీనియర్ ప్లేయర్స్ అందరూ ఒకే తాటిపైకి రావడం అత్యంత కీలకం.

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?