Sri Rama Navami: బాల రామయ్య నుదుటిన సూర్య తిలకం.. ట్రయిల్ రన్ నిర్వహించిన శాస్త్రవేత్తలు..
కోట్లాది రామయ్య భక్తుల కల తీరింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం అయోధ్యలో పవిత్రమైన శ్రీ రామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. రామ నవమి సందర్భంగా గర్భ గుడిలో కొలువుదీరిన బాల రామయ్య నుదిట సూర్యుడు తిలకం దిద్దనున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని నిర్మాణంలో ఉన్న రామాలయంలో ఐఐటీ రూర్కీ, చెన్నై శాస్త్రవేత్తలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ఇకపై ప్రతి రామనవమికి రాబోయే 20 సంవత్సరాల పాటు పునరావృతమవుతుంది. సూర్య కిరణాలు బాల రామయ్య నుదుటన సృష్టించే ఈ తిలకం అద్భుతమైన సాంకేతికత, ఆధ్యాత్మిక కలయికగా మారనుంది.

శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్యలో ఆదివారం రామనవమి పండుగను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణంలో ఉన్న రామాలయం గర్భగుడిలో కొలువుదీరిన బాల రామయ్య నుదిటిన సూర్య కిరణాలు తిలకాన్ని దిద్దనున్నాయి. ఈ అరుదైన దృశ్యం వరుసగా రెండవ సంవత్సరం ఆవిష్కృతం కానుంది. దీని కోసం చెన్నైలోని ఐఐటీ రూర్కీ తదితర ప్రాంతాల శాస్త్రవేత్తలు వివిధ సంస్థల నిపుణులతో కలిసి శనివారం సూర్య తిలక ధారణ గురించి కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ ట్రయల్ 90 సెకన్ల పాటు కొనసాగింది. ఇందులో ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు స్వయంగా తన కిరణాలతో బాల రామయ్యకు తిలకం దిద్దాడు.
ఆలయ నిర్వహణ ట్రస్ట్ సిబ్బంది చెప్పిన ప్రకారం ఈ ప్రక్రియ దాదాపు 8 నిమిషాల పాటు కొనసాగింది. దీని కోసం గర్భగుడిలో తెర 3 నిమిషాలు మూసివేశారు. ఈ సందర్భంగా గర్భగుడిలో రెండు మందపాటి తెరలను ఏర్పాటు చేశారు. దీని తరువాత ఐఐటి రూర్కీ, ఐఐటి చెన్నై సహా దేశంలోని ఇతర ప్రఖ్యాత సంస్థల శాస్త్రవేత్తలు ట్రయల్స్ ప్రారంభించారు. అంతకుముందు ఈ శాస్త్రవేత్తలు శుక్రవారం అర్ధరాత్రి లేజర్ కిరణాలను ఉపయోగించి ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించారు. దానిలోకి ఎరుపు రంగు లేజర్ కాంతిని చొప్పించారు. ఈ కాంతి బాల రామయ్యపై పడినప్పుడు.. దాని అందం చూడటానికి చాలా అపురుపమైందిగా అనిపిస్తుంది చూపరులకు. .
ఇలా రానున్న 20 సంవత్సరాలు ప్రతి రామ నవమికి
శ్రీ రామ ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఈ విషయంలో పూర్తి సమాచారం చెప్పారు. రాబోయే 20 సంవత్సరాల పాటు ప్రతి శ్రీ రామనవమి నాడు, సూర్యభగవానుడు స్వయంగా తన కిరణాలతో బాల రామయ్య నుదుటిన తిలకం దిద్దుటాడని ఆయన చెప్పారు. దీనికి అవసరమైన వ్యవస్థను ఆలయంలో శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్రేతాయుగంలో శ్రీ మహా విష్ణుడు.. రాముడిగా సుర్యవంశస్తుడైన దశరధుడికి తనయుడిగా అవతరించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి