Vastu Tips: ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలా.. వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..
ఇంటి నిర్మాణం గురించి మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకునే వస్తువులు, ఇంట్లో ఉండ కూడని వస్తువుల నుంచి కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా వాస్తు నియమాలు పాటించడం వలన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి నుంచి విముక్తి పొందవచ్చు. అయితే కొందరు బద్ధకంతో ఇంట్లో ఉన్న అనవసరమైన వస్తువులను తీసి బయట పడేయడం మర్చిపోతారు. ఇలాంటి అనవసర వస్తువులు ఇంట్లో ఉండడం వలన సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఇంట్లో నివసించదని నమ్మకం.

ఇంటిలో సుఖ సంతోషాలు ఉండాలనుకుంటే.. ముందుగా మీ ఇంటిలో ఉన్న కొన్ని అనవసరమైన, పనికిరాని వస్తువులను తీసివేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఉంచుకోవడం కూడా అశుభం. భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన భాగం. ఆ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఇది ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇంత అజాగ్రత్త, బద్ధకం వల్ల ఒకొక్కసారి ఇంట్లోంచి అనవసరమైన వస్తువులను తీసి పదవేయడం మర్చిపోతారు. అటువంటి ఇంట్లో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి నివసించదు. కనుక ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉంచరాడో తెలుసుకుందాం..
పగిలిన అద్దం
వాస్తు ప్రకారం అద్దాలను ఇంట్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇంట్లో పగిలిన అద్దం లేదా గాజు ఉండటం లక్ష్మీ దేవిని అసంతృప్తిపరుస్తుంది. ఇంట్లో పగిలిన అద్దం సంబంధంలో చీలికను సృష్టిస్తుంది. కనుక వాటిని ఇంట్లో ఉంచకూడదు.
పాడైన దేవుళ్ళు , దేవతల ఫోటోలు, విగ్రహలు
పాత చిత్రాలు, విరిగిన విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు, ఎందుకంటే ఇది లక్ష్మీ దేవికి కూడా కోపం తెప్పిస్తుంది. ఒకే దేవుడు లేదా దేవత చిత్రాలను ముఖాముఖిగా ఉంచుకోవడం కూడా అశుభకరమని భావిస్తారు.
ఖాళీ పర్స్ లేదా డబ్బు సంచి
మీరు మీ పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇలా ఖాళీగా పర్స్ లేదా డబ్బులు పెట్టుకునే ప్లేస్ ఉంటే.. అది ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెట్టదు. సరి కదా ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది.
ముళ్ళ మొక్కలు
గులాబీలు, కాక్టస్ సహా ఇతర ముళ్ళ మొక్కలను ఇంటి లోపల పెంచుకోరాదు. ఇలా ఇంట్లో ముళ్ళ మొక్కలను పెంచుకోవడం సంపద దేవత అయిన లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.
విరిగిన తీగ
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అనవసరమైన వైర్లను ఉంచుకోవడం మంచిది కాదు. ఈ తీగలు జీవితంలో సమస్యలను సృష్టిస్తాయి. దీని కారణంగా సంపద దేవత అయిన లక్ష్మిదేవి ఆగ్రహం వస్తుంది. కనుక ఇంటి నుంచి పాత, విరిగిన వైర్లను వెంటనే తొలగించాలి.
తేనెటీగల గూడు
వాస్తు శాస్త్రంలో తేనే పట్టు, సాలీడుగూళ్లు కూడా అశుభకరమైనవిగా పరిగణించబడతాయి. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల జీవితంలో కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. వీటి వలన కుటుంబ కలహాలు , ఆర్థిక సంక్షోభ సమస్యలను కలిగిస్తాయి. కనుక వీటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది.
పక్షి గూడు
ఇంట్లో పక్షి గూళ్ళు నిర్మించడం కూడా జీవావరణ శాస్త్రంలో ప్రతికూలంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఇంట్లో పక్షి గూళ్ళు ఉంటే.. వాటిని తొలగించడం మంచిది. అయితే ఆ గూళ్ళలో గుడ్లు లేవని ముందుగా నిర్ధారించుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు