Rama Navami 2025: శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి.. దారులన్నీ దక్షిణ అయోధ్య భద్రాద్రి వైపే..
రావయ్యా రామయ్యా.. ఈ ఎదుర్కోలు నీకేనయ్యా.. రమణీ లలామ సీతమ్మ ఎదురుచూపులు నీ కోసమేనయ్యా.. వేదిక భద్రాచలం, మిధిలా స్టేడియం. పెళ్లికొడుకు శ్రీరామచంద్రమూర్తి. పెళ్లికూతురు జనకపుత్రి సీతాదేవి. లగ్నం...అభిజిత్. ఈ పెళ్లికి అందరూ ఆహ్వానితులే. భద్రాచల రామయ్యా...అందరి బంధువయా. సీతారాముల పెళ్లికి ఇవాళ జగమంతా భద్రాద్రికి తరలివస్తోంది. అన్ని దారులు భద్రాద్రికే దారి తీస్తున్నాయి. ఈ కల్యాణం...రమణీయం కమనీయం అనిర్వచనీయం.

సీతారామం.. భద్రాచలం.. దేవదేవుడి కల్యాణం.. చూతము రారండి అంటూ లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. అంగరంగ వైభవంగా జరగనుంది. మిధిలా స్టేడియం అందంగా ముస్తాబైంది. సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.
రావయ్యా రామయ్యా.. ఈ ఎదుర్కోలు నీకేనయ్యా.. రమణీ లలామ సీతమ్మ ఎదురుచూపులు నీ కోసమేనయ్యా.. వేదిక భద్రాచలం, మిధిలా స్టేడియం. పెళ్లికొడుకు శ్రీరామచంద్రమూర్తి. పెళ్లికూతురు జనకపుత్రి సీతాదేవి. లగ్నం…అభిజిత్. ఈ పెళ్లికి అందరూ ఆహ్వానితులే. భద్రాచల రామయ్యా…అందరి బంధువయా. సీతారాముల పెళ్లికి ఇవాళ జగమంతా భద్రాద్రికి తరలివస్తోంది. అన్ని దారులు భద్రాద్రికే దారి తీస్తున్నాయి. ఈ కల్యాణం…రమణీయం కమనీయం అనిర్వచనీయం.
సీతారాముల కల్యాణానికి మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. అన్ని సెక్టార్లలో LED స్క్రీన్లు ఏర్పాటుచేశారు. శ్రీరాముని కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ రామయ్య కల్యాణం, రేపు శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి. చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. వేసవి కావడంతో భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించనున్నారు.
ఈ వేడుకలకు సీఎం, మంత్రులు ,ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న నేపథ్యంలో.. భద్రాచలంలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
దేవస్థానం ఆధ్వర్యంలో రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. కల్యాణ మండపం ప్రాంగణంలో 2 టన్నుల ఏసీలు 50, వంద కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటుచేశారు. లక్ష చదరపు అడుగుల్లో ప్రత్యేక పైపు లైన్ ద్వారా పొగమంచు వెదజల్లే 800 పరికరాలు ఏర్పాటు చేశారు. ఇవి వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
కాగా.. సీతారాముల కల్యాణాన్ని చూడడానికి వచ్చిన భక్తులతో భద్రాచలం కిటకిటలాడుతోంది.




