ఇంట్లోని పాత చీరలు అమ్మేస్తున్నారా.. జాగ్రత్త..వీడియో
అది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామం… మధ్యాహ్న సమయంలో పాత చీరెలు.. పాత బట్టలు కొంటామంటూ చిరు వ్యాపారి గ్రామంలో తిరుగుతున్నాడు. అతని కేకలు విన్న కర్రె వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలు అతన్ని పిలిచి తన ఇంటిలో ఉన్న పాత చీరెలను ఆ వ్యాపారికి ఇచ్చేసింది. పాత చీరెల కొనుగోలు చేసిన ఆ చిరు వ్యాపారి ఆమెకు కొంత మొత్తం చెల్లించాడు. ఆ తర్వాత బట్టలు మూటకట్టుకొని అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
వెంకట సుబ్బమ్మ తనకున్న ఐదున్నర తులాలకుపైగా బంగారు ఆభరణాలు ఎవరికి తెలియకుండా పాత చీరెలోనే మూట కట్టి పెట్టింది. ఆ విషయం మర్చి పోయి, పాత చీరెలన్నీ ఆ వ్యాపారికి ఇచ్చేసింది. సాయంత్రానికి బంగారు నగలు మూట గట్టిన పాత చీరె కూడా వ్యాపారికి ఇచ్చేసిన విషయం గుర్తుకొచ్చిన వెంకట సుబ్బమ్మ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు గ్రామంలోని సీసీటీవీ విజువల్స్ పరిశీలించారు. చీరెలు కొనుగోలు చేసిన వ్యక్తిని తెనాలికి చెందిన తాడిశెట్టి సాంబశివరావుగా గుర్తించారు. వెంటనే అతన్ని సంప్రదించేందుకు తెనాలి వెళ్లారు. అయితే అప్పటికే ఆ చీరెల మడతలు విప్పిన వ్యాపారి సాంబశివరావు అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించాడు. వాటిని జాగ్రత్త చేసి పోలీసుల వద్దకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. అదే సమయంలో పోలీసులు రావడంతో రెండు బంగారు గాజులతో పాటు గొలుసును వారికి అప్పగించాడు. వాటిని పోలీసులు సుబ్బమ్మకు అందజేశారు. బంగారు ఆభరణాలు తిరిగి అప్పగించిన పోలీసులకు సుబ్బమ్మ కృతజ్ఞతలు చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం :
టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు.. వీడియో
టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?
తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్ కెమెరా వీడియో
ఖతర్నాక్ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో