పిట్ట కూడా వాలని చెట్టు.. ఎందుకంత డేంజర్ ??
వృక్షో రక్షతి రక్షితః అంటారు పెద్దలు. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్. పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి.
దుబాయి చెట్టుగా పిలిచే ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతోంది. శంఖు రూపంలో ఉండే కోనో కార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈచెట్టు పచ్చదనాన్ని సంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అరబ్, మధ్య ప్రాచ్యదేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్ల నుంచి, వేడిగాలుల నుంచి రక్షణగా ఉండేందుకు ఈ మొక్క ను దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచుతున్నారు. కోనోకార్పస్ చెట్లపై కనీసం పిట్ట కూడా వాలదని, అలాంటి చెట్లను తెలంగాణ వ్యాప్తంగా నాటారని, వాటిని వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల అన్నారు. హరితహారం కార్యక్రమంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 273 కోట్ల మొక్కలను నాటామని, దీనివల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7 శాతం పెరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అయితే ఆ మొక్కలలో చాలా వరకు కోనోకార్పస్ చెట్లు ఉన్నాయని, అవి పర్యావరణానికి హానికరమని స్పీకర్ అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gond Katira: సమ్మర్‌లో గోండ్ కటిరా తింటున్నారా.. ఇది మీ కోసమే!
సిల్వర్ స్క్రీన్ మీద నయా గ్లామర్.. టాలీవుడ్‌ను రూల్ చేయడం పక్క
ఇంటిముందు ఏర్పడిన భారీ గుంత.. ఏంటా అని పరిశీలించగా.. బయటపడిన ఆలయం