AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటిముందు ఏర్పడిన భారీ గుంత.. ఏంటా అని పరిశీలించగా.. బయటపడిన ఆలయం

ఇంటిముందు ఏర్పడిన భారీ గుంత.. ఏంటా అని పరిశీలించగా.. బయటపడిన ఆలయం

Phani CH

|

Updated on: Apr 05, 2025 | 12:05 PM

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఎక్కడో అక్కడ తవ్వకాల్లో పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. తాజాగా ఏకంగా ఓ ఆలయమే బయటపడింది. అవును నంద్యాల జిల్లాలో ఓ ఇంటికింద ఉన్న పురాతన శివాలయం బయటపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం పేరుసోముల గ్రామం కోటవీధిలోని మద్దిలేటి ఇంటిముందు భారీ గుంత పడింది. ఉదయాన్నే ఇంటిముందు గుంత చూసిన యజమాని షాకయ్యాడు. ఏమై ఉంటుందా అని పరిశీలించగా గోడలతో కూడిన ఒక నిర్మాణం లాంటిది కనబడింది. విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లందా ఆ గుంత దగ్గరకు చేరారు. దానిని పరిశీలించి చూడగా పురాతన శివుని గుడి బయట పడింది. పూర్వం ఆ ఇల్లు ఉన్న స్థలంలో శివాలయం ఉండేదని, బహుశా ఇప్పడు బయటపడింది అదే ఆలయం కావచ్చని స్థానికులు చర్చించుకున్నారు. బెస్త మద్దిలేటి అనే అతను అక్కడ ఆలయం ఉందని తెలియక ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనతో ఆయన ఇల్లు ఖాళీచేసాడు. స్థానికులంతా కలిసి ఆలయం లోపలికి వెళ్లేందుకు పూడిక తీసి దారి ఏర్పాటు చేసారు. ఈ క్రమంలో అక్కడ ఓ కోనేరు ఉన్న ఆనవాళ్లు కూడా వారు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆలయం బయటపడిందన్న విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల వారు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చి పరమశివుని దర్శించుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరాది ఉగాది రానున్న తరుణంలో ఇలా శివాలయం బయటపడటం అంతా దైవలీల అంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

6 రోజుల్లో 4 కిలోలు తగ్గిన మోడల్.. ఈ కొరియన్‌ డైట్‌ ప్లాన్‌ ఏంటంటే..?

అతని పేరు హ్యాపీ.. అతని పేరు హ్యాపీ.. కానీ అతనకు లేనిదే అది.!!

ఇకపై దోమలు మనిషిపై వాలాలంటేనే భయపడతాయి.. కారణాలు ఇవే

కారులో వెళ్తున్న యువకులకు షాక్.. కారుపై కనిపించిన ఆకారాన్ని చూసి..

గజరాజు నడిస్తే.. గజ్జికుక్కలు అరుస్తాయి..