6 రోజుల్లో 4 కిలోలు తగ్గిన మోడల్.. ఈ కొరియన్ డైట్ ప్లాన్ ఏంటంటే..?
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. ఆహారంపై అవగాహన పెంచుకుని, నిపుణుల సలహా తీసుకుంటూ ప్రక్రియను మొదలు పెట్టాలి. అయితే కేవలం ఆరు రోజుల డైటింగ్‌తో నాలుగు కిలోల బరువు తగ్గిందో మోడల్. తన సక్సెస్ సీక్రెట్ ఇదీ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఫ్రీలాన్స్ మోడల్’ షెర్రీ.. ఫిట్‌నెస్ డిస్‌క్లెయిమర్‌తో తన పోస్ట్‌ను స్టార్ట్ చేసింది. ఫలానా డైట్ తీసుకోవాలని తను ఎవరికీ సూచించడం లేదని కేవలం తన సొంత అనుభవాన్ని షేర్ చేస్తున్నట్లు పోస్ట్ లో రాసుకొచ్చింది. స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ ‘కార్బ్-లెస్’ మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం. స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చింది. తద్వారా తన డైట్‌ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతని పేరు హ్యాపీ.. అతని పేరు హ్యాపీ.. కానీ అతనకు లేనిదే అది.!!
ఇకపై దోమలు మనిషిపై వాలాలంటేనే భయపడతాయి.. కారణాలు ఇవే
కారులో వెళ్తున్న యువకులకు షాక్.. కారుపై కనిపించిన ఆకారాన్ని చూసి..