AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై దోమలు మనిషిపై వాలాలంటేనే భయపడతాయి.. కారణాలు ఇవే

ఇకపై దోమలు మనిషిపై వాలాలంటేనే భయపడతాయి.. కారణాలు ఇవే

Phani CH

|

Updated on: Apr 04, 2025 | 4:20 PM

దోమ ఎంత డేంజరో అందరికీ తెలిసిందే.. ఈ దోమల కారణంగా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ఒక్కోసారి ప్రాణాలే పోతాయి. డెంగ్యూ, మలేరియా వంటి వివిధ రకాల వ్యాధులను వ్యాప్తి చేస్తూ లక్షలాది మంది ప్రాణాలను హరిస్తున్నాయి. అవి ఎక్కడో ఒక చోట కాకుండా ప్రతి ప్రదేశంలోనూ ఉంటూ మనుషుల రక్తాన్ని పీలుస్తున్నాయి.

అయితే, ఇకపై దోమలు మన దరి చేరాలన్నా, మన రక్తం తాగాలన్నా భయపడేలా శాస్త్రవేత్తలు ఒక సరికొత్త అస్త్రాన్ని అభివృద్ధి చేశారు. మలేరియా దోమలకు మన రక్తంతోనే చెక్ పెట్టే ఒక విధానాన్ని కనుగొన్నారు. మలేరియా వ్యాధికి కారణమైన దోమలకు మనుషుల రక్తాన్ని విషంగా మార్చే విషయంలో వారు ముందడుగు వేశారు. ఈ మేరకు సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. నిటిసినోన్ అనే ఔషధాన్ని మన రక్తంలోకి ఎక్కించడం ద్వారా, ఆ రక్తం దోమలకు విషంగా మారుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. నిటిసినోన్ సాధారణంగా అరుదైన జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఔషధం దోమలకు ప్రాణాంతకంగా మారుతుందని పరిశోధనలో తేలింది. ఈ ఔషధాన్ని వాడుతున్న రోగులపై జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నిటిసినోన్ రోగుల జీవక్రియలకు సహకరిస్తూనే, వారి రక్తాన్ని తాగిన దోమల జీవక్రియకు మాత్రం విఘాతం కలిగిస్తుందని, ఫలితంగా ఆ దోమలు 12 గంటల్లోనే మరణిస్తున్నాయని గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారులో వెళ్తున్న యువకులకు షాక్.. కారుపై కనిపించిన ఆకారాన్ని చూసి..

గజరాజు నడిస్తే.. గజ్జికుక్కలు అరుస్తాయి..

47 ఏళ్ల వయసులో.. తండ్రి కాబోతున్న కమెడియన్

లిప్‌ లాక్ సీన్ ఉందని.. నితిన్ సినిమాను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్‌

మెడలో చెప్పుల దండ వేసి.. యాట్యూబర్‌ను దంచికొట్టిన మహిళలు