మెడలో చెప్పుల దండ వేసి.. యాట్యూబర్‌ను దంచికొట్టిన మహిళలు
వివాదాస్పద అంశాల్లో దూరి కేసులు దాకా తెచ్చుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్లు. అయితే హద్దు దాటితే డిపార్ట్‌మెంట్ సెక్షన్లతో కొడుతుంది. కానీ జనాలు అప్పటికప్పుడే కొడుతున్నారు. అచ్చంగా ఇలాంటి పరిస్థితే తెచ్చుకున్నాడు ఓ యూట్యూబర్. జనాలకు చిర్రెత్తుకొచ్చే వరకు... తనపై దాడి చేసే వరకు తెచ్చుకున్నాడు.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే..! అత్తాపూర్ రాధకృష్ణానగర్‌లో తెలుగు యూట్యూబర్ పై పలువురు యువకులు, మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ యూట్యూబర్‌ను చితకొట్టారు. ఇక రాజేంద్రనగర్ సర్కిల్, హైదర్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న యూట్యూబర్ గిరీష్ దారమోని.. ద చిత్రగుప్త్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై నిలదీసేందుకు ఇంటికెళ్లిన వారిపై కారంపొడితో గిరీష్ దాడి చేశారు. దీంతో గిరీష్ మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు నిలదీసేందుకు వెళ్లిన వాళ్లు. ఇక రాజేంద్రనగర్‌లో యూట్యూబర్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబర్ గిరీష్‌పై దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం 45 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 40 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు తనపై, తన కార్యాలయంపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు యూట్యూబర్ గిరీష్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరో కాదు.. పక్కా బిజినెస్ మ్యాన్ !! 500 కోట్ల ఆస్తులంటే మాటలు కాదుగా…

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
