- Telugu News Photo Gallery Cinema photos Tollywood news heroins like kayadu lohar, bhagyashri borse upcoming movies
సిల్వర్ స్క్రీన్ మీద నయా గ్లామర్.. టాలీవుడ్‌ను రూల్ చేయడం పక్క
కొత్త నీరు రావటం పాత నీరు పోవటం అన్నది ఎక్కడైనా కామన్. ఇండస్ట్రీలోనూ పరిస్థితులు అలాగే ఉంటాయి. కొత్త తారలు వచ్చినప్పుడు పాత వాళ్లు సైడ్ ఇవ్వాల్సిందే. హీరోల విషయంలో పరిస్థితి ఇలా ఉండక పోయినా.. హీరోయిన్ విషయంలో మాత్రం రూల్ పక్కాగా అప్లై అవుతుంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
Updated on: Apr 05, 2025 | 12:18 PM

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో శ్రీలీల, కృతి శెట్టి లాంటి హీరోయిన్ల పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ సడన్‌గా ఇప్పుడు ఆ ఇద్దరు కనుమరుగయ్యారు. కొత్త అందాల రాకతో పాత హీరోయిన్లను పక్క పెట్టేశారు మన మేకర్స్.

దీంతో ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ బ్యూటీస్. ప్రజెంట్ టాలీవుడ్ స్క్రీన్ మీద భాగ్యశ్రీ బోర్సే జోరు గట్టిగా కనిపిస్తోంది. ఇంకా ఒక్క హిట్ కూడా పడకపోయినా... వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.

రీసెంట్‌గా రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన కయాదు లోహర్ కూడా బిజీ అవుతున్నారు. డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. వరుసగా స్ట్రయిట్ మూవీస్‌కి సైన్ చేస్తున్నారు.

కొత్త తారల హవా పెరగటంతో శ్రీలీల, కృతి శెట్టి సైడ్ అయ్యారు. తెలుగులో అవకాశాలు తగ్గటంతో ఇతర ఇండస్ట్రీల మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. కృతి మూడు సినిమాల్లో నటిస్తున్నా.. ఆ మూడూ తమిళ సినిమాలే.

శ్రీలీల చేతిలో కూడా మూడు సినిమాలు ఉన్నా అందులో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. కొత్త హీరోయిన్ల రాకతో సీనియర్స్ సైడ్ అవుతున్నారో, లేక సీనియర్ సైడ్ అయ్యాకో కొత్త భామలు ఎంట్రీ ఇస్తున్నారోగానీ... ఎప్పటికప్పడు టాలీవుడ్ స్క్రీన్ కొత్త గ్లామర్ మాత్రం జోరు చూపిస్తోంది.




