Gond Katira: సమ్మర్‌లో గోండ్ కటిరా తింటున్నారా.. ఇది మీ కోసమే!
గోండ్ కటిరా.. దీనిని బాదం గమ్ అని కూడా పిలుస్తారు. దీనిని వేసవిలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఎండాకాలంలో గోండ్ కటిరా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. గోండ్ కటిరా తింటే మలబద్ధకం, మూల వ్యాధి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. శరీరానికి శక్తినివ్వడమే కాకుండా ఎముకలను బలోపేతం చేస్తుంది. గోండ్ కటిరా వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా జీర్ణక్రియ, బరువు నియంత్రణ, చర్మ సంరక్షణ, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యంగా ఉంటారు. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. శరీరం నీటిని కోల్పోకుండా హైడ్రేటెడ్‌గా ఉంచడంలో మేలు చేస్తుంది. డీహైడ్రేషన్‌ను దూరం చేస్తుంది. వేడి వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ఇరిటేషన్, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. సమ్మర్ ర్యాషెష్లను తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిల్వర్ స్క్రీన్ మీద నయా గ్లామర్.. టాలీవుడ్‌ను రూల్ చేయడం పక్క
ఇంటిముందు ఏర్పడిన భారీ గుంత.. ఏంటా అని పరిశీలించగా.. బయటపడిన ఆలయం