Allergy: చీటికి మాటికి అలర్జీలు వేధిస్తున్నాయా? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం
ముక్కులోకి దుమ్ము, ధూళి వంటివి ఏదైనా ప్రవేశిస్తే అది నేరుగా మెదడుకు చేరుతుంది. మళ్ళీ అది ముక్కు ద్వారా ప్రవేశించి పొరపాటున ఆహార నాళంలోకి ప్రవేశిస్తే అది మూసుకుపోయేలా చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ముక్కు ఎంత సున్నితంగా ఉంటుందంటే జాగ్రత్తగా లేకుంటే తీవ్ర నష్టాలు తప్పవు..

ముక్కులోకి దుమ్ము, ధూళి వంటివి ఏదైనా ప్రవేశిస్తే అది నేరుగా మెదడుకు చేరుతుంది. మళ్ళీ అది ముక్కు ద్వారా ప్రవేశించి పొరపాటున ఆహార నాళంలోకి ప్రవేశిస్తే అది మూసుకుపోయేలా చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ముక్కు ఎంత సున్నితంగా ఉంటుందంటే జాగ్రత్తగా లేకుంటే తీవ్ర నష్టాలు తప్పవు. సూక్ష్మక్రిములు ముక్కులోకి ప్రవేశించి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. అందువల్ల కలుషితమైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ముక్కు, నోటిని కప్పుకోవడం మంచిది. కాబట్టి ఇలాంటి అంతరాలను అర్థం చేసుకోవడం ద్వారా అలెర్జీలు వంటి సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసుకోవచ్చు. మీకు జలుబు లేదా మరేదైనా అలెర్జీ ఉంటే, ముక్కు రోజంతా కారుతూనే ఉంటుంది. ఇది చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
ముక్కును ఎల్లప్పుడు కప్పి ఉంచాలి
అలెర్జీ సంబంధిత సమస్యలను నివారించడానికి బయటికి వెళ్ళేటప్పుడు మీ ముక్కును కప్పుకోవడం లేదా మాస్క్ ధరించడం మంచిది. దీనితో పాటు రాత్రి పడుకునే ముందు మీ ముక్కులో ఒక చుక్క నెయ్యి వేసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల పొడిబారడం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
జలుబు నయం కావాలంటే..
మీ ముక్కు నుంచి నిరంతరం నీరు కారుతోందా? కొంచెం పౌడర్ తీసుకుని ముక్కు ద్వారా పీల్చండి. ఇలా చేస్తే ముక్కు కారడం పూర్తిగా ఆగిపోతుంది.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
తగినంత వెలుతురు, వెంటిలేషన్ ఉన్న గదిలో నివసిస్తుంటే ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. దీనితో పాటు ఉప్పు నీటితో క్రమం తప్పకుండా ముక్కును కడుక్కోవడం వల్ల అనేక బాక్టీరియా లేదా అలెర్జీ సమస్యలను నివారించవచ్చు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.