AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: బాడీని సర్ఫ్ వేసి కడిగినట్లే.. చెత్తను క్లీన్ చేసే పవర్‌ఫుల్ డిటాక్స్ డ్రింక్ ఇదిగో..

ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలలో సిన్నమన్ హనీ డిటాక్స్ ఒకటి. దీనిని దాల్చిన చెక్క పొడి, తేనె, నిమ్మకాయ రసంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. శరీరంలోని విషపదార్థాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పానీయం సహాయపడుతుంది. సాధారణ టీకి ప్రత్యామ్నాయంగా ఉదయం పూట దీనిని తీసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..

Health Tips: బాడీని సర్ఫ్ వేసి కడిగినట్లే.. చెత్తను క్లీన్ చేసే పవర్‌ఫుల్ డిటాక్స్ డ్రింక్ ఇదిగో..
Cinnamon Honey Detox
Shaik Madar Saheb
|

Updated on: Feb 23, 2026 | 10:13 AM

Share

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డిటాక్స్ పానీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో దాల్చినచెక్క, తేనె డిటాక్స్ డ్రింక్ ఒకటి.. దీనిని దాల్చిన చెక్క పొడి, తేనె, నిమ్మకాయ రసంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన పానీయం శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. దాల్చినచెక్క-తేనె డిటాక్స్ డ్రింక్.. యాంటీఆక్సిడెంట్లు (పాలిఫెనాల్స్), సిన్నమాల్డిహైడ్ (దాల్చినచెక్కలో), ఫినోలిక్ సమ్మేళనాల (తేనెలో) గొప్ప మూలం.. ఇది జీవక్రియను (Metabolism) మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం, వాపును (Inflammation) తగ్గించడం, బరువు తగ్గడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

దాల్చిన చెక్క తేనె డిటాక్స్ డ్రింక్‌కు కావలసిన పదార్థాలు:

దాల్చిన చెక్క పొడి,  తేనె, నిమ్మకాయ, నీరు..

తయారీ విధానం:

సిన్నమన్ హనీ డిటాక్స్ తయారుచేయడం చాలా సులభం. ముందుగా, ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకుని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత, దానికి తగినంత దాల్చిన చెక్క పొడిని కలపాలి. నీటి పరిమాణం, దాల్చిన చెక్క ఘాటును బట్టి పొడిని సర్దుబాటు చేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి వేసిన తర్వాత మరికొద్దిసేపు మరిగించాలి. అప్పుడే దాల్చిన చెక్కలోని పోషకాలు నీటిలో కలుస్తాయి. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. చివరగా, దానికి కొద్దిగా నిమ్మకాయ రసం, ఒక స్పూన్ తేనెను కలిపి బాగా కలుపుకుంటే వేడివేడి సిన్నమన్ హనీ డిటాక్స్ సిద్ధం అవుతుంది. నిమ్మకాయ, తేనె దాల్చిన చెక్క ఘాటైన రుచిని సమతుల్యం చేస్తాయి.

ఎన్నో పోషకాలు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు:

దాల్చిన చెక్క, తేనె, నిమ్మకాయల కలయిక అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ డిటాక్స్ పానీయం శరీరంలోని టాక్సిన్స్‌ను సమర్థవంతంగా తొలగిస్తుంది.. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే, ఇది రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది.. శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

ఎప్పుడు తీసుకోవాలి?

ఈ డిటాక్స్ పానీయాన్ని ఉదయం పూట తీసుకోవడం ఉత్తమం. చాలా మంది ఉదయం టీ లేదా గ్రీన్ టీ తీసుకుంటారు. దాని స్థానంలో ఈ సిన్నమన్ హనీ డిటాక్స్ ను తీసుకోవచ్చు. డిటాక్స్ డైట్‌లో ఉన్నప్పుడు, రోజులో అనేక రకాల డిటాక్స్ టీలను ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది.. అందులో ఇది ఒక రకం. డిటాక్స్ సమయంలో పాలు కలిపిన టీలను నివారించాలి. కాబట్టి పాల బదులు నీటితో తయారుచేసిన ఈ డిటాక్స్ పానీయం అనుకూలంగా ఉంటుంది.

గమనిక: దాల్చిన చెక్క కొద్దిగా ఘాటుగా ఉంటుంది. కాబట్టి, గ్యాస్ట్రిక్ లేదా అల్సర్ సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అల్సర్ తీవ్రతను బట్టి, వారు దీనిని తక్కువ మోతాదులో లేదా అప్పుడప్పుడు (రెండు, మూడు రోజులకు ఒకసారి) తీసుకోవాలి. అల్సర్స్ తీవ్రంగా ఉన్నవారు ఈ పానీయాన్ని పూర్తిగా నివారించడం మంచిది. ఏదేమైనా.. ఏదైనా కొత్త ఆహార పదార్థాన్ని డైట్‌లో చేర్చుకునే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us