ముందుగా మటన్ ను తీసుకుని నీటిలో బాగా కడిగి దానిలో పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, మూడు టీ స్పూన్స్ నిమ్మరసం కలిపి ముక్కలకు పట్టించాలి.
స్టెప్ - 1
ఇక ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా నెయ్యి వేసి దానిలో చేసి, బిర్యానీ ఆకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన మిర్చి వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి.
స్టెప్ - 2
ఆ తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ తీసుకుని వేసి స్టవ్ మీదే సన్నని మంట మీద వేయించండి. దానిలో నీళ్ళు పోసి, కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి.
స్టెప్ - 3
మటన్ ఉడికితే దానిలో బాస్మతి బియ్యం వేసి రుచికి తగినంత ఉప్పును జోడించి మిక్స్ అయ్యేలా కలుపుకోండి.
స్టెప్ - 4
కుక్కర్ మూత పెట్టి సన్నని మంట మీద 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచండి. కొద్దీ సేపటి తర్వాత కిందకు దించేయండి.
అంతే, వేడి వేడి మటన్ పులావ్ రెడీ.