AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా మార్పు అంటే.. అప్పటికంటే అందంగా మరింత గ్లామరస్‌గా మారిపోయిన హీరోయిన్

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో మౌనమేలనోయి సినిమా ఒకటి ఈ సినిమా లోని సాంగ్స్ ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి యూత్‌ను ఈ సినిమా ఆకట్టుకుంది.

ఇది కదా మార్పు అంటే.. అప్పటికంటే అందంగా మరింత గ్లామరస్‌గా మారిపోయిన హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 23, 2026 | 11:20 AM

Share

చాలా మంది హీరోయిన్స్  అదృష్టాన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతంగా ఫెమస్ అవుతారు. అలాగే తొలి సినిమాతోనే హిట్ అందుకుంటారు. అయితే చాలా మంది ఎక్కువాకాలం కొనసాగలేకపోతున్నారు. తక్కువ సినిమాలే చేసి కనుమరుగైన భామలు చాలా మంది ఉన్నారు. కొందరికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మరికొంతమంది అనుకోని కారణాల వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిన వారు ఉన్నారు. అయితే ఇంకొంతమంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. చేసింది ఓకే ఒక్క సినిమా. అది సూపర్ హిట్ అయ్యింది.

పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆ హీరోయిన్ పేరు సంపద వజే. ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టకపోవొచ్చు.. మౌనమేలనోయి సినిమా హీరోయిన్ అంటే టక్కున గుర్తుకు వస్తుంది ఈ చిన్నది.  నటుడు సచిన్ జోషి నటించిన మౌనమేలనోయి చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. 2002లో విడుదలైన ఈ సినిమాప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో సచిన్ జోషి, సంపద వజే హీరో హీరోయిన్లుగా  నటించారు. ఈ సినిమాను డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెరకెక్కించారు. అప్పట్లో యూత్ ను ఈ మూవీ గా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. ఈ సినిమాతోపాటు.. ఇందులోని సాంగ్స్ కూడా అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చాయి.

ఈ చిత్రంలోని ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా.. నీ నయనాల ఆ గగనాల సితారకలా.. చాలా మంది ఫేవరెట్ సాంగ్. ఇప్పటికీ ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే మౌనమేలనోయి సినిమా తర్వాత హీరోయిన్ సంపద మరో సినిమాలో కనిపించలేదు. నటన పరంగా ఆకట్టుకున్న ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత బీటౌన్ బుల్లితెరలో అడుగుపెట్టింది. 2004లో ప్యార్ కి కస్తి మేయిన్ సీరియల్లో నటించింది. ఆ తర్వాత రిస్తాన్ కి దూర్, సియా కే రామ్ సీరియల్స్ లో నటించింది. 2016లో మంచి రెస్పాన్స్ వచ్చిన కర్మఫల్ దాత శని సీరియల్లో నటించి మెప్పించింది సంపద.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఆమె ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Sampada Vaze (@sampadavaze)

Follow Us