Teeth Whitening: ఈ కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకోండి.. మెరిసే దంతాలు మీ సొంతం..
పూర్వ కాలంలో ప్రజలు తమ దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్‌పేస్ట్, టూత్ బ్రష్‌లను ఉపయోగించేవారు కాదు. కొన్ని రకాల చెట్ల పుల్లలతో, పసుపు, ఉప్పు వంటి ఆహార పదార్ధాలతో తమ దంతాలను శుభ్రం చేసుకునేవారు. అందుకే వృధాప్యం వచ్చినా సరే దంతాలు, చిగుళ్ల సమస్యతో బాధపడలేదు. ఈరోజు దంతాలకు ఆరోగ్యాన్ని, అందాన్ని ఇచ్చే సజమైన ఐదు రకాల చెట్ల పుల్లల గురించి తెలుసుకుందాం.

దంతాలను ప్రకాశవంతంగా ఉండేలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని చెప్పుకునే అనేక టూత్‌పేస్టులు మార్కెట్లో మీకు కనిపిస్తాయి. అయితే నిపుణులు కూడా వాటిని ఉపయోగించే విషయంలో రకరకాల సిఫార్సు చేయడం తరచుగా కనిపిస్తుంది. పూర్వ కాలంలో ప్రజలు మొక్కల కొమ్మలను ఉపయోగించేవారు. ఇవి దంతాలను మెరుస్తూ ఉండేలా చేయడమే కాదు దంతాలు, చిగుళ్ళకు సంబంధించిన సమస్యలను కూడా రాకుండా చేశాయి. వృద్ధాప్యంలో కూడా అప్పటి ప్రజల దంతాలు బలంగా ఉండేవి. అయితే నేటి కాలంలో దంతాలు, చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు చిన్న వయస్సులోనే ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ రోజు టూత్ బ్రష్‌గా ఉపయోగించగల ఐదు చెట్ల కొమ్మల గురించి తెలుసుకుదాం.. వీటి వలన దంతాలు మెరుస్తాయి. నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ప్రజలు తమ దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్కెట్ లో అందుబాటులో ఉన్న రకరకాల టూత్‌పేస్ట్‌తో సహా అనేక కంపెనీలకు చెందిన వివిధ రకాల టూత్ బ్రష్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే మీ దంతాలకు సహజ రక్షణ ఇవ్వాలనుకుంటే.. దంతాలను శుభ్రం చేసేందుకు ఉత్తమ ఎంపిక ప్రకృతి లో లబించే చెట్ల కొమ్మలే. అలా ఉపయోగించే ఐదు రకాల టూత్ స్టిక్స్ గురించి తెలుసుకుందాం.
వేప: దంతాలను శుభ్రం చేసేందకు బ్రష్ వంటివి అందుబాటులో లేక పొతే ఎక్కువగా ఆధారపడేది వేప పుల్ల మీదనే. వేప చెట్టు కొమ్మను ఎక్కువగా టూత్‌పిక్‌లుగా ఉపయోగిస్తారు. కనుక దీని పేరును మొదట గుర్తుకొస్తుంది. వేపలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి దంతాలను కావిటీస్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
పీలు (మిస్వాక్): బహుశా మీరు ఈ చెట్టు పేరు విని ఉండకపోవచ్చు. పీలు చెట్టు అంటే మిస్వాక్ చెట్టు. దీనిని కొన్ని కంపెనీలు టూత్‌పేస్ట్ తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది మీ దంతాలను శుభ్రం చేసే అద్భుతమైన టూత్ బ్రష్ కూడా. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
తుమ్మ: మార్కెట్లో అనేక దంత సంరక్షణ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. వాటిలో ఒకటి తుమ్మ. దీని కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకోవడం ద్వారా మీరు మీ దంతాలను ప్రకాశవంతం చేసుకోవచ్చు.
ఖైర్: ఇది ఔషధ గుణాలున్న మొక్క. దీని కలపతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇది మీ దంతాలను మెరిసేలా చేయడమే కాదు ఇప్పటికే దంత క్షయం అంటే పిప్పి పళ్ళు ఉన్నావారికి లేదా చిగుళ్ళు వాపు ఉన్నవారికి మంచి మెడిసిన్. ఇది దంతాల కుహరాలను నివారిస్తుంది. అనేక దంత ప్రయోజనాలను ఇస్తుంది.
అతిమధురం: మీరు లైకోరైస్ పేరు చాలాసార్లు విని ఉంటారు. ఔషధ గుణాలతో నిండిన ములేథి (లైక్వోరైస్), జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. దీనితో పాటు అతిమధురంని దంతాలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది దంతాలను మెరిసేలా చేయడమే కాదు దుర్వాసనను కూడా తొలగిస్తుంది.