Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి రోజూ మీరు టీ ఎలా తాగుతున్నారు..? ఈ పొరపాటు మాత్రం చేయకండి..!

చాలా మంది పేపర్ కప్పుల్లో టీ తాగడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిదా అన్నదే ప్రశ్న. ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, పేపర్ కప్పుల్లో ఉండే మైక్రోప్లాస్టిక్‌లు మన శరీరానికి హానికరం కావొచ్చు. ఇది తెలిశాక మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ప్రతి రోజూ మీరు టీ ఎలా తాగుతున్నారు..? ఈ పొరపాటు మాత్రం చేయకండి..!
Hot Tea Health Risks
Follow us
Prashanthi V

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 06, 2025 | 8:38 AM

ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం పేపర్ కప్పులో వేడి టీ తాగడం మన ఆరోగ్యానికి హానికరం కావొచ్చు. ఎందుకంటే వేడి ద్రవం వల్ల పేపర్ కప్పు లోపల ఉండే చిన్న ప్లాస్టిక్ పొర క్షీణించి మైక్రోప్లాస్టిక్‌లు నీటిలో కలిసిపోతాయి.

పేపర్ కప్పులు చూస్తే అవి కాగితంతో తయారు చేసినట్లే కనిపిస్తాయి. కానీ వాటి లోపల బాగా పలుచటి ప్లాస్టిక్ లేదా కో-పాలిమర్ ఫిల్మ్ ఉంటుంది. ఇది ద్రవం బయటకు రాకుండా నిలిపేలా సహాయపడుతుంది. అయితే వేడి ద్రవం ఆ ప్లాస్టిక్‌ను కరిగించి ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది.

ఈ అధ్యయనాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వైద్యులు నిర్వహించారు. వారు 85°C నుండి 90°C వరకు ఉండే వేడి నీటిని పేపర్ కప్పులో 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నీటిలో ఉన్న సూక్ష్మ-ప్లాస్టిక్‌లను పరిశీలించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి అధ్యయనం.

వైద్యులు చెప్పినదాని ప్రకారం.. ఒక టీ కప్పులో సగటున 25,000 సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. ఒక వ్యక్తి రోజుకు మూడుసార్లు పేపర్ కప్పులో టీ తాగితే.. దాదాపు 75,000 మైక్రోప్లాస్టిక్‌లు మింగుతున్నట్లు అవుతుంది. వీటి పరిమాణం మన కళ్లకు కనబడదు.. కానీ శరీరానికి హానికరం.

వైద్యులు రెండు పద్ధతుల్లో పరీక్షలు చేశారు. మొదట వేడి నీటిని పేపర్ కప్పులో పోసి 15 నిమిషాలు అలాగే ఉంచారు. తర్వాత ఆ నీటిని పరిశీలించారు. రెండవసారి.. పేపర్ కప్పును మొదట గోరువెచ్చని నీటిలో ముంచి తరువాత లోపల ఉండే ఫిల్మ్‌ను తీసి మళ్లీ వేడి నీటిలో ఉంచారు. ఈ ప్రక్రియ వల్ల ప్లాస్టిక్‌లో జరిగిన మార్పులను గుర్తించారు.

అధికంగా ప్రజలు టీ తీసుకున్న తర్వాత 15 నిమిషాల లోపే తాగేస్తారని ఒక సర్వేలో తేలింది. అందుకే ఈ సమయం అంత ముఖ్యమైంది. అదే సమయంలో ద్రవం గరిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ సూక్ష్మ ప్లాస్టిక్‌లు తేలికగా రసాయనాల్ని ఇముడ్చుతాయి. ఇందులో క్రోమియం, కాడ్మియం, పల్లాడియం వంటి విషపూరిత లోహాలు కూడా ఉండొచ్చు. ఇవి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత జీర్ణ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కొన్ని సమయాల్లో దీని ప్రభావం తీవ్రమవుతుంది.

వైద్యులు మాట్లాడుతూ.. మట్టితో చేసిన గ్లాస్ లు వంటి సంప్రదాయ వస్తువులు ఇటువంటి డిస్పోజబుల్ కప్పులకు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని చెప్పారు. ప్లాస్టిక్‌కు బదులుగా వేరే వస్తువులను వాడటం పర్యావరణానికి మంచిదే కానీ.. ఆ ప్రత్యామ్నాయ పదార్థం మన ఆరోగ్యానికి నిజంగా సురక్షితమా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి.