మీరు మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నారా.. ఇది మీ కోసమే!
45 ఏళ్ల తరువాత మహిళల హార్మోన్ల స్థాయిల్లో మార్పులు రావడం వల్ల పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. ఈ దశను మెనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ సమయంలో శరీరంలో జరిగే మార్పులు అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా చర్మంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చర్మం పొడిబారడం, ముడతలు ఏర్పడటం, కొందరికి మొటిమలు రావడం, అవాంఛిత రోమాల పెరుగుదల వంటి సమస్యలు ఎదురవుతాయి.
అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ దశలో ఎస్ట్రోజెన్ స్థాయిల్లో అనేక మార్పులు జరుగుతాయి. ఎస్ట్రోజెన్ తక్కువగా ఉండటం వల్ల చర్మం తేమ కోల్పోయి పొడిగా మారుతుంది. కొందరికి ముఖంపై ముడతలు వస్తాయి. కొందరికి మొటిమలు రావడం, ఫైన్లైన్స్ వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని నివారించేందుకు సరైన చర్మ సంరక్షణ పద్ధతులను పాటించాలి. మెనోపాజ్ సమయంలో చర్మం పొడిగా మారడంతో పాటు సూర్యరశ్మి ప్రభావానికి కూడా అధికంగా గురవుతుంది. అందుకే SPF- 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా వాడాలి. బయటకు వెళ్లే ముందు దీనిని ముఖానికి, మెడకు అప్లై చేస్తే చర్మానికి రక్షణ కలుగుతుంది. మెనోపాజ్ సమయంలో చర్మం తేమ కోల్పోయి పొడిగా మారుతుంది. దీని వల్ల ముడతలు త్వరగా రావచ్చు. అందుకే తగిన మాయిశ్చరైజర్‌ను వాడడం చాలా అవసరం. హైలూరోనిక్ యాసిడ్, గ్లిజరిన్, సెరామైడ్లు వంటి చర్మానికి తేమను అందించే పదార్థాలు ఉండే మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎగిరే ఉడుత కనిపించిందోచ్.. అంతరించిపోయింది అనుకుంటే..
ICUలో అలేఖ్య చిట్టి.. కన్నీళ్లతో వేడుకుంటూ అక్కాచెల్లి వీడియో

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్
