ఎగిరే ఉడుత కనిపించిందోచ్.. అంతరించిపోయింది అనుకుంటే..
అంతరించిపోయిన జంతుజాలంలో ఒకటిగా భావించిన ఎగిరే ఉడుతను హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ గుర్తించింది. లాహౌల్-స్పితి జిల్లాలోని మియార్ లోయలో కనిపించిన ఉడుత శరీరం అంతా ఉన్నితో కప్పబడి ఉంది. ఈ అరుదైన ఉడుత కెమెరాలకు చిక్కినట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కెమెరా ట్రాపింగ్ సర్వేలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.
దీని శాస్త్రీయనామం యూపెటౌరస్ సినేరియస్ . ఈ జాతికి చెందిన ఉడుత చివరిసారిగా 1994లో కనిపించింది. ఆ తర్వాత అది అంతరించిపోయిందని అంతా భావించారు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ కనిపించడంతో జీవశాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలు ఫలించాయని చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తామని హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. దేశంలో మంచు చిరుతల జనాభా లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ట్రాప్ కెమెరాలు అమర్చగా… వాటిలో ఎగిరే ఉడుత విజువల్స్ రికార్డయ్యాయి. మియార్ లోయలోని వ్యూహాత్మక ప్రాంతాలలో 62 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. వన్యప్రాణి విభాగం, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. స్పితిలోని కిబ్బర్ నుండి వచ్చిన స్థానిక యువకుల బృందం 2010 నుంచి సంరక్షణ ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. వీరు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎగిరే ఉడుతతో పాటు, కెమెరా ట్రాప్‌లు మంచు చిరుత, ఎర్ర నక్క, హిమాలయ తోడేలు, కొండ ముంగిస తదితర జాతుల జంతువుల ఫొటోలను కూడా రికార్డు చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ICUలో అలేఖ్య చిట్టి.. కన్నీళ్లతో వేడుకుంటూ అక్కాచెల్లి వీడియో

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
