ICUలో అలేఖ్య చిట్టి.. కన్నీళ్లతో వేడుకుంటూ అక్కాచెల్లి వీడియో
హైప్! సోషల్ మీడియాలో కావాల్సినంత దొరుకుతుంది. మంచో చెడో.. మనదైన రోజు అది మనల్ని అమాంతం పైకి లేపుతుంది. తేడా వస్తే.. కింద పడేస్తుంది. ఇప్పుడు అలేఖ్య చిట్టి పచ్చళ్ల విషయంలో ఈ రెండూ చేసి చూపించింది. సుమి, అలేఖ్య, రమ్య ఈ ముగ్గురు అక్కాచెళ్లలు మొదలెట్టిన పచ్చళ్ల బిజినెస్ వారి రీల్స్ కారణంగా.. ఓ రేంజ్‌లో నడిచింది.
ఆ క్రమంలోనే అలేఖ్య నోటి నుంచి వచ్చిన బూతు పురాణం ఇప్పుడు వారిని తొక్కేసినంత పని చేసింది. దాంతో పాటే.. వారిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగేలా చేసింది. చివరికి అలేఖ్య ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స్ తీసుకునే వరకు వచ్చింది. గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి ఆడియోనే తెగ తిరిగింది. మా చెల్లె చేసింది తప్పని.. కానీ కావాలని చేసింది కాదని అలేఖ్య చెల్లె, అక్క క్లారిటీ ఇచ్చినా కూడా ఆమె పై ట్రోల్ ఆగలేదు. పైగా ఈ ముగ్గురు అక్కాచెళ్లలు యూట్యూబ్‌లో వైరల్ అవ్వాలనుకున్న అందరికీ ఓ ఆసరాగా మారిన పరిస్థితి. ఈ క్రమంలోనే అందరూ అలేఖ్య చిట్టిపై వీడియోలు చేయడం షురూ చేశారు. వ్యూస్ వేటలో ఎక్కువగా అలేఖ్యను, రమ్యనే ఎయిమ్ చేయడం చాలా ఎక్కువ చేశారు. నమ్ముకున్న పచ్చళ్ల బిజినెస్ పోయింది. పైగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అండ్ తాను చేసిన పనిపై విమర్శలు.. దీంతో తీవ్ర డిప్రషన్లోకి వెళ్లిన అలేఖ్య చివరికి ఆసుపత్రి పాలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
