ఎవరూ పత్తిత్తులు కాదు.. వాళ్ళు పరవన్నం వండితే తెల్లారేవరకూ చల్లారకుండా ఉండదు: గీతూ రాయల్
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో మెసేజ్స్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెల్లు అలేఖ్య, సుమ, రమ్య కంచర్ల నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే పచ్చళ్ల రేట్స్ ఎక్కువగా ఉన్నాయని అడిగిన ఓ కస్టమర్ పై అసభ్యకరమైన.. రాయడానికి వీలు లేని పదాలతో బూతులు తిడుతూ రిప్లై ఇచ్చింది అలేఖ్య.

అలేఖ్య చిట్టి పికిల్స్..సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈ పేరు వైరల్ అవుతుంది. ముగ్గురు అక్క చెల్లెళ్లు కలిసి స్టార్ట్ చేసిన పచ్చళ్ళ బిజినెస్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. కస్టమర్స్ దేవుళ్ళు అంటూనే తమ పికిల్స్ కొన్నవారిని నోటికొచ్చినట్టు తిట్టి వైరల్ అయ్యారు. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లలో అలేఖ్య చిట్టి పచ్చళ్ల ధర ఎక్కువగా ఉంది ఎందుకు.? అని అడిగిన పాపానికి ఓ కస్టమర్ ను అమ్మనా బూతులు తిట్టింది. ఆ ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. నెటిజన్స్ ఊరుకుంటారా.. ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. అంతే కాదు ఆమె ఇంకా ఎవరెవరిని తిట్టింది అనేది కూడా బయటకు లాగారు. దాంతో అలేఖ్య చిట్టికి సంబంధించిన మూడు నాలుగు ఆడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. దాంతో ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి.
మొదట్లో ఆ ఆడియో ఒకరికి పంపబోయి మరొకరికి పంపాము అని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు.. దాంతో క్షమించండి తప్పయింది అని ఓ వీడియో, ట్రోల్ చేయకండి అంటూ మరో వీడియో ఇలా వరుసగా వదిలారు ఈ సిస్టర్స్.. చివరకు ట్రోల్స్ దెబ్బకు అలేఖ్య చిట్టి ఆసుపత్రి పాలు అయ్యింది. ట్రోల్స్ కారణంగా డిప్రషన్ కు గురయ్యి బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావడంతో హాస్పటల్ లో జాయిన్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మా అక్కకు ఏమైనా అయితే మీరే బాద్యులు అంటూ సిస్టర్స్ లో ఒకరు ఎమోషనల్ కూడా అయ్యారు.
ఇదిలా ఉంటే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ను ట్రోల్ చేసే వారితో పాటు వారికి సపోర్ట్ చేసేవారు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ కూడా అలేఖ్య సిస్టర్స్ కు సపోర్ట్ చేశాడు. కొంతమంది అతన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఫెమ్ గీతూ రాయల్ కూడా అలేఖ్య చిట్టి సిస్టర్స్ కు సపోర్ట్ చేసింది. ఈమేరకు ఆమె ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో గీతూ మాట్లాడుతూ.. “ఈ బూతులు అనేవి ఏవైతే ఉన్నాయో అది కోపమొచ్చినప్పుడు మగపిల్లకాయలే కాదు ఆడపిల్లకాయలు కూడా మాట్లాడొచ్చు.. కానీ ఎవరితో మాట్లాడుతున్నాం ఎప్పుడు మాట్లాడుతున్నాం.. మనం మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేది.. అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్లు వాళ్ల కస్టమర్‌ని ఏదో చిన్న ప్రశ్న అడిగినదానికి అమ్మనా బూతులు తిడుతూ మెసేజ్ చేశారు. ఆ ఆడియో వచ్చేసి భయంకరంగా వైరల్ అయిపోయింది. చాలా కాంట్రవర్సీలు, ట్రోల్స్ జరిగాయి.. అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసినారు.. అంతా అయిపోయింది.. ఆ ముగ్గురు ఆడపిల్లకాయలు వచ్చి ముగ్గురూ సారీ చెప్పినారు.. మేము చేసింది తప్పు అయిపోయింది.. క్షమించండి.. ఇంకెప్పుడూ చేయం అన్నట్లు చెప్పారు.. తప్పు అనేది అందరూ చేస్తారు.. మనిషి స్వభావమే తప్పు చేయడం. ఇక్కడ ట్రోల్ చేసేవారు ఎవరూ పత్తిత్తులు ఏం కాదు.. వాళ్లందరూ పరవన్నం వండితే తెల్లారేవరకూ చల్లారకుండా ఉండదు. అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టింది గీతూ.. కాగా గీతూ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




