- Telugu News Photo Gallery Cinema photos Can You Guess The Actress In This Photo She Is Heroine Tamannah Bhatia
Tollywood : ఆ హీరోతో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. చివరకు అదే హీరోతో లవ్, బ్రేకప్.. ఇప్పుడు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. దాదాపు దశాబ్దానికిపైగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్ని రోజులుగా లవ్, బ్రేకప్ విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే..
Updated on: Apr 10, 2025 | 2:08 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. ఓటీటీ వెబ్ సిరీస్ లో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ బ్యూటీ ఎవరో కాదు.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ తమన్నా భాటియా. ప్రస్తుతం ఓదెల 2 చిత్రంలో నటిస్తుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషనల్లో పాల్గొంటుంది. ఇందులో లేడీ అఘోరి పాత్రలో కనిపించనుంది తమన్నా.

ఇన్నాళ్లు సినిమాల్లో గ్లామర్ పాత్రలతో మెప్పించిన ఈ అమ్మడు హిందీలో మాత్రం లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సీన్లతో రచ్చ చేసింది. ముఖ్యంగా హీరో విజయ్ వర్మతో కలిసి రొమాంటిక్ సీన్లతో కనిపించింది.

ఈసిరీస్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరు బాలీవుడ్ మూవీ ఫంక్షన్స్, పార్టీలలో సందడి చేశారు. కట్ చేస్తే.. కొన్నాళ్లకే వీరిద్దరి లవ్ బ్రేకప్ దిశగా నడిచింది.

ఇప్పుడు వీరిద్దరు విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఓదెల 2 మూవీ ప్రమోషన్లలో విజయ్ ప్రస్తావిస్తూ పరోక్షంగా ఓ యాంకర్ ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్నా నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది.




