AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు స్విమ్మింగ్ చేస్తున్నారా..? ముందుగా ఈ విషయాలను తెలుసుకోండి..!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరుచుకోవాలంటే స్విమ్మింగ్ ఎంతో మంచి మార్గం. ఇది కేవలం రిలాక్సేషన్‌ కి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నిద్రలేమి, ఒత్తిడి, అధిక బరువు వంటి సమస్యలకు ఇది సహజమైన పరిష్కారం. స్విమ్మింగ్ వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు స్విమ్మింగ్ చేస్తున్నారా..? ముందుగా ఈ విషయాలను తెలుసుకోండి..!
Swimming In Summer
Prashanthi V
|

Updated on: Apr 10, 2025 | 2:47 PM

Share

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతాయి. దీంతో వేసవి వేడిని తట్టుకోలేక చాలా మంది చల్లటి నీటిలో ఈత కొడుతూ శరీరానికి చల్లదనం పొందేందుకు స్విమ్మింగ్‌ చేస్తుంటారు. ఇది ఒక ఆరోగ్యకరమైన అలవాటు మాత్రమే కాదు.. శరీరానికి ఎంతో మేలు చేసే వ్యాయామం కూడా. అయితే వేసవిలో స్విమ్మింగ్ చేసేవాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో ఎండ తీవ్రత పెరిగే సమయంలో శరీరానికి చల్లదనం కలిగించే అత్యుత్తమ మార్గాలలో స్విమ్మింగ్ ఒకటి. నీటిలో కొంతసేపు గడిపితే శరీరంలోని వేడి బయటకు వెళ్లిపోతుంది. ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా.. ఉబ్బసం, నీరసం వంటి సమస్యలను నయం చేస్తుంది.

స్విమ్మింగ్ ఒక సంపూర్ణ శరీరానికి వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఈత కొట్టేటప్పుడు చేతులు, కాళ్లు, మెడ ఇలా ప్రతి భాగం కదలడం జరుగుతుంది. ఇది కండరాల బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరులోనూ మెరుగుదల వస్తుంది.

నిత్యం ఒత్తిడితో బాధపడేవారికి స్విమ్మింగ్ ఒక మంచి చికిత్సలా పని చేస్తుంది. నీటిలో గడిపే సమయం మనసును హాయిగా చేస్తుంది. అలసట, ఆందోళనలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా రోజూ పనిచేసి అలసిపోయిన వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.

బరువు తగ్గాలని కోరుకునేవారు స్విమ్మింగ్‌ను ముఖ్యంగా ఎంచుకోవచ్చు. స్విమ్మింగ్ చేయడం వల్ల కేలరీలు కరిగిపోతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. దాంతో పాటు శరీర ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వేసవిలో ఎక్కువ మంది నిద్రపట్టలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు రోజూ సాయంత్రం వేళ స్విమ్మింగ్ చేస్తే శరీరానికి అవసరమైన అలసట కలిగి రాత్రి నిద్ర బాగా పడుతుంది. ఇది నిద్రలేమికి సహజ చికిత్సగా మారుతుంది.

స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల వ్యక్తిత్వంలో మంచి మార్పు వస్తుంది. నీటిలో కదలికలు సమన్వయంగా చేయడం వల్ల శరీరం ఫిట్‌గా మారుతుంది. అదే సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, యువతకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

వేసవిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్యలో ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో స్విమ్మింగ్ చేయాలంటే సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి. ఇది చర్మాన్ని హానికరమైన అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి కాపాడుతుంది.

మీరు ఈత కొట్టే పూల్ పరిశుభ్రంగా ఉండాలి. నీటిలో క్లోరిన్ సరైన మోతాదులో ఉండకపోతే చర్మ సమస్యలు వస్తాయి. చర్మం మీద రాషెస్, అలర్జీలు రావచ్చు. అందుకే ఎప్పుడూ హైజినిక్ కండిషన్లలో ఉండే పూల్‌లను ఎంచుకోవాలి. వేసవిలో స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరానికి ఉల్లాసం కలిగి ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.