AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG High Court Exam Dates 2025: తెలంగాణ కోర్టు ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు ఇవే.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు గురువారం విడుదలైనాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభంకానున్నాయి..

TG High Court Exam Dates 2025: తెలంగాణ కోర్టు ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు ఇవే.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
High Court Exam Dates
Srilakshmi C
|

Updated on: Apr 10, 2025 | 3:14 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 10: తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రారంభంకానున్నాయి. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సైతం హైకోర్టు విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు నమోదు చేసి హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద సుమారు 1673 ఎగ్జామినర్‌, జూనియర్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్‌, సబ్-ఆర్డినేట్‌ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ వరకు షిఫ్ట్‌ల వారీగా తెలంగాణ హైకోర్టు నిర్వహించనుంది.

తెలంగాణ హైకోర్టు పోస్టులకు సంబంధించిన హాల్‌ టికెట్ల 2025 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏ పరీక్ష ఎప్పుడంటే..

  • ఎగ్జామినర్‌ పరీక్ష తేదీ: ఏప్రిల్ 15, 2025.
  • జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 16, 2025.
  • ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2025.
  • రికార్డ్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2025.
  • కాపీయిస్ట్‌ పరీక్ష తేదీ: ఏప్రిల్ 15, 2025.
  • టైపిస్ట్‌ పరీక్ష తేదీ: ఏప్రిల్ 15, 2025.

తెలంగాణ యూవర్సిటీల్లో నియామకాలకు సన్నాహాలు ప్రారంభం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 6 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తులు ప్రారంభించింది. పోస్టులను భర్తీ చేసేందుకు న్యాయపరంగా, సాంకేతికంగా కార్యనిర్వాహక కమిటీలు (ఈసీ)లు తొలుత ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా పూర్తిస్థాయి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి వీసీలను ఆదేశించింది. దీంతో యూనివర్సిటీల్లో పరిపాలనా విభాగంలో విధులు నిర్వహించిన ప్రొఫెసర్లు, విద్యానిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోని ఉస్మానియా, సురవరం ప్రతాపరెడ్డి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, మహిళా యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు వేర్వేరుగా ఈసీలో సభ్యుల నియామకాలపై సీనియర్‌ ప్రొఫెసర్లతో తాజాగా చర్చించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కమిటీ సభ్యుల ఎంపికను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని ఇందులో నిర్ణయించారు. కమిటీ సభ్యుల ఎంపిక పూర్తయ్యాక పూర్తి జాబితాను ఉన్నత విద్యామండలికి పంపి ఆమోదం పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్