Viral Video: టార్గెట్ రీచ్ కాలేదనీ.. ఉద్యోగిని మోకాళ్లపై కుక్కలా నడిపించిన కంపెనీ యాజమన్యం! వీడియో
టార్గెట్ రీచ్ కానందుకు ఓ కంపెనీ తన ఉద్యోగులను దారుణంగా శిక్షించింది. ఇందులో భాగంగా ఓ ఉద్యోగి మెడకు బెల్ట్ తగిలించి కుక్క మాదిరి నేలపై మోకాళ్లపై నడిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కొచ్చిలోని ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తిరువనంతపురం, ఏప్రిల్ 6: కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పని చేసే ఉద్యోగులు తమ లక్ష్యాలను చేధించకపోతే పలు విధాలుగా శిక్షించి సంప్రదాయం ఉంది. దీంతో తాజాగా ఓ ఉద్యోగి తన టార్గెట్ రీచ్ కాకపోవడంతో అతడి మెడలో బెల్ట్ కట్టి, ప్యాంటు విప్పించి కుక్క మాదిరిగా మోకాళ్లపై నడిపించారు. మరో ఉద్యోగి పక్కనే వంటి కుక్కమాదిరి సకిలిస్తూ ఘోరంగా అవమానించారు. అక్కడే ఉన్న మరో ఉద్యోగి ఈ మొత్తం దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ తాజాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర కార్మిక శాఖ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. మరో వీడియోలో ఉద్యోగులను శిక్షగా తమను తాము బట్టలు విప్పికోవాలని బలవంతం చేస్తున్నట్లు కనిపించింది.
ఆ అమానవీయ వేధింపులపై హైకోర్టు న్యాయవాది కులత్తూర్ జైసింగ్ ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా దర్యాప్తుకు ఆదేశించింది. వైరల్ వీడియోలలో కనిపించిన ఉద్యోగుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు, ఈ సంఘటనకు మాజీ మేనేజర్‌ను నిందించారు. లక్ష్యాలను సాధించడంలో విఫలమైన వారికి తమ యాజమాన్యం ఇటువంటి శిక్షలు విధించేదని సంస్థ ఉద్యోగులు కొంతమంది స్థానిక మీడియాకు తెలిపారు. ఈ సంఘటన కలూర్ సమీపంలోని పెరుంబవూర్‌లో ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన బాధిత ఉద్యోగి మాత్రం తమ కంపెనీ ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని మీడియాకు చెప్పడం కొసమెరుపు. తానింకా అదే సంస్థలో పనిచేస్తున్నానని, ఈ విజువల్స్ కొన్ని నెలల క్రితం నాటివి, అప్పట్లో ఆ సంస్థ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనతో బలవంతంగా ఇలా చేయించాడని చెప్పాడు.
Modern day slavery🤬
Employees at Hindustan Power Links claim they are punished for missing sales targets..allege they were forced to crawl, lick spit & bark like dogs
They earn just Rs 6000 to Rs 8000 a month. #Kerala govt orders probe pic.twitter.com/su37r32qJR
— Nabila Jamal (@nabilajamal_) April 5, 2025
ఆ తర్వాత కంపెనీ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తప్పించిందని, ఈ వీడియో ద్వారా తమ కంపెనీని దూషించవద్దని కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసులకు,కార్మిక శాఖ అధికారులకు కూడా ఇదే చెప్పడం విస్తుగొలిపింది. అయితే రాష్ట్ర కార్మిక మంత్రి వి. శివన్‌కుట్టి మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. ఈ ఘటన దిగ్భ్రాంతికరమైనదని ఆయన అన్నారు. కేరళ వంటి రాష్ట్రంలో దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, దర్యాప్తు నిర్వహించిన తర్వాత సంఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని జిల్లా కార్మిక అధికారిని ఆదేశించారు. మరోవైపు కేరళ రాష్ట్ర యువజన కమిషన్ కూడా జోక్యం చేసుకుని వేధింపుల సంఘటనపై కేసు నమోదు చేసింది. ఈ విషయంలో నివేదిక సమర్పించాలని ప్యానెల్ జిల్లా పోలీసు చీఫ్‌ను ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.