Ambulance: ప్రపంచంలోనే అతి చిన్న అంబులెన్స్.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
ఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్టప్ ఈవెంట్ మహాకుంభ్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భారతదేశంతో సహా 50 దేశాల నుండి 3 వేలకు పైగా స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను, అవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో, ప్రపంచంలోనే అతి చిన్న అంబులెన్స్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీనిని పూణేకు చెందిన ఒక విద్యార్థి రూపొందించారు.

మూడు రోజుల పాటు జరిగే స్టార్టప్ ఈవెంట్ మహా మేళా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ఏప్రిల్ 3న మొదలైన ఈవెంట్ ఏప్రిల్ 5 వరకు కొనసాగుతుంది. భారతదేశంతో సహా 50 దేశాల నుండి 3 వేలకు పైగా స్టార్టప్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం నిర్వహణలో దేశంలోని ప్రతి మూల నుండి చాలా మంది యువ పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభ, కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చారు.
ఈ మహా కుంభమేళాలో ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన విషయం ప్రపంచంలోనే అతి చిన్న అంబులెన్స్. ఇది మొట్టమొదటి, అతి చిన్న సౌర విద్యుత్ అంబులెన్స్. దీని పొడవు కేవలం 2.9 మీటర్లు, ఇది టాటా నానో కంటే .2 మీటర్లు చిన్నది. ఈ కార్యక్రమం ‘స్టార్టప్ ఇండియా @ 2047 అన్రావెలింగ్ ది స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే థీమ్ ఆధారంగా నిర్వహించడం జరుగుతోంది. ఇది భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, భవిష్యత్తును ఊహించుకుని రూపొందించినది.
ఈ అంబులెన్స్ ప్రత్యేకత ఏమిటి?
ఈ అంబులెన్స్ పరిమాణం చాలా చిన్నది, దీని కారణంగా అత్యవసర పరిస్థితిలో ఎక్కడికైనా సులభంగా తీసుకురావచ్చు. అవసరమైన అన్ని సౌకర్యాలు అందులో అందుబాటులో ఉన్నాయి. ఈ అంబులెన్స్ నిర్వహణ ఖర్చు గురించి మాట్లాడుకుంటే, అది సాధారణ అంబులెన్స్ కంటే తక్కువ. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ స్టార్టప్ మహాకుంభ్‌ను ప్రారంభించారు. ఇది పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT), స్టార్టప్ ఇండియా చొరవతో నిర్వహించడం జరుగుతోంది.
దీని రూపకర్త ఎవరు?
ఈ ప్రత్యేకమైన అంబులెన్స్‌ను పూణేలోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో చదువుతున్న సుధాంషు పాల్ రూపొందించారు. TV9 తో ప్రత్యేక సంభాషణలో సుధాన్షు మాట్లాడుతూ, ఇప్పటివరకు తయారు చేసిన అన్ని అంబులెన్స్‌లను ఏదో ఒక వాహనంలో అమర్చే వారని, అయితే అంబులెన్స్ కోసం రూపొందించిన మొదటి వాహనం ఇదేనని అన్నారు. ఈ అంబులెన్స్‌ను ఏ మలుపుకైనా లేదా ఇరుకైన ప్రాంతానికి తీసుకెళ్లడం చాలా సులభం అవుతుందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..