iPhone 17: ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా…? మునుపటి కంటే రెండింతలు ఫవర్‌ఫుల్!
iPhone 17: ఆపిల్ ఐఫోన్.. ఈ ఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది కొత్త మోడల్‌ను విదుదల చేస్తుంటుంది ఆపిల్ కంపెనీ. గత ఏడాది ఐఫోన్ 16 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన ఆపిల్ కంపెనీ.. ఇప్పుడు తదుపరి మోడల్ ఐఫోన 17 సిరీస్‌ను తీసుకువస్తోంది. ఈ మోడల్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ఉండనున్నాయి..

ఆపిల్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించింది. కానీ ఇప్పుడు కంపెనీ తదుపరి మోడల్ ఐఫోన్ 17 లైనప్ చాలా చర్చనీయాంశమైంది. ఈసారి ఆపిల్ ఐఫోన్లలో చాలా మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిలో డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్‌లు, పనితీరు అప్‌గ్రేడ్‌లను మొత్తం శ్రేణిలో చూడవచ్చు.
ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్:
ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అవుతాయి. ఇంతలో ఆపిల్ ఈ రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు 48MP టెలిఫోటో కెమెరాతో రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, కొత్త ఐఫోన్ 17 సిరీస్ డిజైన్‌లో కూడా మార్పులు కనిపిస్తాయి. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ల కెమెరా మాడ్యూల్‌ను కూడా ఆపిల్ మార్చింది. ఈసారి కంపెనీ ప్రో మోడళ్ల కెమెరా మాడ్యూల్‌ను మార్చవచ్చని తెలుస్తోంది.
ఐఫోన్ 17 ప్రోకి పెద్ద అప్‌గ్రేడ్:
మీడియా నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఈ రెండు మోడళ్లలో 48MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీనిలో ఫ్లెక్సిబుల్ లెన్స్‌లు కూడా దొరుకుతాయి. దీనితో పాటు, 35mm, 85mm లెన్స్‌లు కూడా వాటిలో అందుబాటులో ఉంటాయి. ఆపిల్ మునుపటి సిరీస్‌లో 12MP టెలిఫోటో కెమెరా ఇచ్చింది. దీనిలో 120mm లెన్స్ కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా, ఐఫోన్ 17 ప్రో సిరీస్ కెమెరాలు 3.5x ఆప్టికల్ జూమ్‌కు మద్దతు ఇవ్వగలదు. ఈ ఫోన్‌లో కొత్త టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది తక్కువ బ్రైట్‌నెస్‌లో కూడా షాట్లు తీయడానికి ఉపయోగపడుతుంది.
ఈ సిరీస్ ఎప్పుడు రానుంది?
మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్ సిరీస్‌లో నాలుగు మోడళ్లను విడుదల చేయవచ్చు. ఇందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉండవచ్చు. ఆపిల్ ఈసారి తన ప్లస్ మోడల్‌ను విడుదల చేయదు. కానీ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌లో మీరు A19 బయోనిక్ సిరీస్ ప్రాసెసర్‌లను కూడా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు ఫోన్ బ్యాటరీ, స్టోరేజీలో కూడా అప్‌గ్రేడ్‌లను ఉండవచ్చని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ డమ్మీ యూనిట్లు బయటపడ్డాయి. ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే ఈ రెండు ఫోన్‌లలో డైనమిక్ ఐలాండ్ డిస్ప్లే ప్యానెల్‌ను కూడా అందించవచ్చు. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా సంగీతం వింటున్నప్పుడు కూడా ఈ డైనమిక్ ఐలాండ్ పని చేస్తుందట.ఆపిల్ రాబోయే ఐఫోన్ ఇతర హార్డ్‌వేర్ ఫీచర్స్ కూడా భిన్నంగా ఉండవచ్చని తెలుస్తోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి