కలెక్టర్ గారే టీచర్.. ఆ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెబుతూ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా పర్యవేక్షణ, సమీక్షలతో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్..ఈసారి తరగతి గదిలో టీచర్‌గా మారారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించగా, అది కేవలం పరిపాలనా సందర్శనగా కాకుండా ఒక ప్రేరణాత్మక తరగతిగా మారింది.
పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ నేరుగా తరగతి గదిలోకి వెళ్లారు. విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టులపై అవగాహన తెలుసుకునేందుకు ప్రశ్నలు వేశారు. బోధన ఎలా జరుగుతోంది? అర్థం కావడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా? అంటూ విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. అక్కడితో ఆగకుండా, పదో తరగతి విద్యార్థుల కోసం స్వయంగా పాఠాలు చెప్పడం ప్రారంభించారు. సైన్స్ పాఠ్యాంశంలో భాగమైన “నాడీకణ నమూనా నిర్మాణం” అంశాన్ని బోర్డుపై గీసి, దాని భాగాలను వివరించాలని సూచించారు. నాడీకణం నిర్మాణంలో ఉండే భాగాలు, వాటి పనితీరును సులభంగా అర్థమయ్యేలా వివరించారు. కొంతమంది విద్యార్థులను బోర్డుకు పిలిచి, వారు గీసిన చిత్రాలను సరిదిద్దుతూ మార్గనిర్దేశం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చదువుపై స్పష్టమైన ప్రణాళిక అవసరమని సూచించారు. ప్రతి రోజు నిర్దిష్ట సమయ పట్టికను అనుసరించాలని, ప్రతి సబ్జెక్టులో గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలపై సాధన చేయాలని తెలిపారు. సమయ నిర్వహణ, పునరావృత పాఠనం, స్వీయ పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. పరీక్షల భయం వద్దని, ఆత్మవిశ్వాసమే విజయానికి మూలమని ప్రోత్సహించారు.కలెక్టర్ తరగతి గదిలో పాఠాలు చెప్పిన దృశ్యం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “కలెక్టర్ గారే పాఠాలు చెప్పడం మాకు గొప్ప అనుభవం” అని కొందరు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకూ ఇది ఒక స్ఫూర్తిదాయక సందర్భంగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు 'గ్యాస్ ఫీజు' కట్టాల్సిందే..
అమ్మ దొంగ చేపా... ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

