విశ్వంభరుడి పరిస్థితేంటి?.. చరణ్ మేనేజర్ కొడుకుకు బంపర్ ఆఫర్
మెగాస్టార్ చిరు హీరోగా వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ విశ్వంభర. వీఎఫ్‌ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమా.. జులైలో రిలీజ్ కావచ్చనే వార్తలు ఈ మధ్యన బయటికి వచ్చాయి. అయితే అది సాధ్యం అవుతుందా? కాదా ? అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తలెత్తుతోంది. ఎందుకంటే ఈ మూవీ ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదని ఇన్‌సైడ్ టాక్. డీల్ పూర్తి కావాలంటే.. మంచి రేట్ కుదరాలి. మంచి రేటు ఫిక్స్ అవ్వాలి అంటే.. ఫైనల్ కాపీ రెడీ అవ్వాలి. ఆ కాపీని ఓటీటీ సంస్థలు చూసి.. డీల్ సెట్ చేసుకోవాలి. అయితే ఇదంతా ఈ షార్ట్ టైంలోనే జరగాల్సి ఉండడంతో.. ఈ మూవీ రిలీజ్‌పై నెట్టింట డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. మరి మేకర్స్ ముందుకొచ్చి ఈ డౌట్స్‌ను క్లియర్ చేసి.. క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మేనేజర్ కొడుకు దృషిక్ బంపర్ ఆఫర్ కొట్టాడు. హిట్ సినిమా సీక్వెల్ మ్యాడ్ 3లో వన్ ఆఫ్ ది హీరో గా సెలక్ట్ అయ్యాడు. ఇక దృషిక తండ్రి ప్రవీణ్ రామ్ చరణ్ దగ్గర మేనేజర్‌గా ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు. చరణ్‌కు సంబంధించిన సినిమా వ్యవహారాలను చూసుకుంటాడు. ఈక్రమంలోనే తన మేనేజర్ కొడుకు దృషిక్‌కు సినిమాలంటే ఇంట్రెస్ట్ అని తెలిసి చరణ్ ఎంకరేజ్ చేశారట. దృషిక్ కూడా లండన్ వెళ్లి మరీ యాక్టింగ్‌లో ట్రెనింగ్ తీసుకున్నాడని.. ఈ క్రమంలోనే మ్యాడ్ 3లో హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడని తెలుస్తోంది.
అంతా బాగుందనుకున్న లోపే వివాదం.. విమర్శలు..
కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ చాలా ఏళ్ల తరువాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి KH RK రీయూనియన్ అనే పేరుతో గ్లింప్స్ రిలీజ్ అయింది. నెల్సన్‌తో పాటే.. కమల్, రజనీ , అనిరుధ్ ఈ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ విపరీతంగా వైరల్ అవుతోంది. దాంతో పాటే ట్రోల్‌కు కూడా గురవుతోంది. కొందరు నెటిజన్లు ఈ అనౌన్స్ మెంట్ గ్లింప్స్‌పై నెట్టింట విమర్శలు చేస్తున్నారు. అంతా బాగున్నా… అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లో ఆ అమ్మాయిలు, వాళ్ల ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఎందుకంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీన్నో వివాదంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రజినీ, కమల్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్స్‌ను పట్టించుకోకుండా KH RK రీయూనియన్ గ్లింప్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

