Petrol Pumps: మీ బైక్‌లో పెట్రోల్ వేయించేటప్పుడు ట్యాంక్ ఫుల్ అయినట్లు ఎలా తెలుస్తోంది..? ఆ శబ్దం వెనుక సైన్స్ ఇదే!
Petrol Pumps: పెట్రోల్ పంపులో మీ వాహనంలో పెట్రోల్ గానీ, డీజిల్ గాని వేసేటప్పుడు ట్యాంకు ఫుల్ అయినట్లు ఎలా తెలుస్తుంది. ఏదో సెన్సార్ ఉంటుందని అనుకుంటారు. కానీ దాని వెనుక సైన్స్ దాగి ఉంది. ట్యాంక్ నిండగానే నాజిల్ నుండి వచ్చే "క్లిక్" అనే ఓ శబ్దం వినిపిస్తుంది..

Petrol Pumps: పెట్రోల్ పంపులో మీ వాహనంలో పెట్రోల్ గానీ, డీజిల్ గాని వేసేటప్పుడు ట్యాంకు ఫుల్ అయినట్లు ఎలా తెలుస్తుంది. ఏదో సెన్సార్ ఉంటుందని అనుకుంటారు. కానీ దాని వెనుక సైన్స్ దాగి ఉంది. ట్యాంక్ నిండగానే నాజిల్ నుండి వచ్చే “క్లిక్” అనే ఓ శబ్దం వినిపిస్తుంది..
Petrol Pumps: మీకు బైకో.. కారో ఉండి బంకుల్లో పెట్రోల్, డీజిల్ వేసుకునేందుకు వెళ్లి ఉండవచ్చు. పెట్రోల్ గానీ, డీజిల్ గాని కొట్టించుకునే ముందు కొన్ని విషయాలను గమనించాలి. ఆ విషయాలలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంటుంది. మీరు మీ వాహనంలో పెట్రోల్ వేసుకునే ముందు ఓ విషయాన్ని గమనించి ఉంటారు. కానీ అది ఎందుకు జరుగుతుందోనని పెద్దగా పట్టించుకోరు.
పెట్రోల్ పంపు వద్ద ట్యాంక్ ఫుల్ అవ్వగానే నాజిల్ నుండి “క్లిక్” అని శబ్దం వచ్చి పెట్రోల్ ఆగిపోవడం మనం గమనిస్తుంటాం. చాలా మంది ఇది ఏదో ఎలక్ట్రిక్ సెన్సార్ పని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ ఆటో-కట్ వెనుక ఒక సరళమైన భౌతిక సూత్రం ఉంది.
ఇది కూడా చదవండి: Underwater Tunnel: దేశంలో నీటి అడుగున తొలి రోడ్డు, రైలు సొరంగం.. ఇక 6 గంటల ప్రయాణం నిమిషాల్లోనే..
వాస్తవానికి పెట్రోల్ నాజిల్ చివర ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దీనిని “సెన్సింగ్ పోర్ట్” అంటారు. పెట్రోల్ ట్యాంక్ లోకి వెళ్తున్నంతసేపు ఈ రంధ్రం ద్వారా గాలి లోపలికి వెళ్తూ ఒత్తిడిని సమతుల్యం చేస్తుంది. అయితే పెట్రోల్ స్థాయి పెరిగి ఈ చిన్న రంధ్రాన్ని కప్పేసినప్పుడు గాలి ప్రవాహం ఆగిపోతుంది. దీంతో నాజిల్ లోపల ఒక వాక్యూమ్ ఏర్పడుతుంది.
ఈ వాక్యూమ్ ప్రభావం వల్ల నాజిల్ లోపల ఉన్న ఒక చిన్న మెకానికల్ డయాఫ్రామ్ పైకి లాగుతుంది. ఈ డయాఫ్రామ్ కదలడం వల్ల ట్రిగ్గర్ విడుదలయ్యి పెట్రోల్ ప్రవాహం “టక్” అని ఆగిపోతుంది. ఈ ప్రక్రియను భౌతికశాస్త్రంలో “వెంటిరి ఎఫెక్ట్” అని కూడా అంటారు. ఇది పెట్రోల్ ఓవర్‌ఫ్లో అవ్వకుండా నిరోధించడానికి రూపొందించిన ఒక సమర్థవంతమైన, విశ్వసనీయమైన యాంత్రిక పద్ధతి.
ఇది కూడా చదవండి: SBI Home Loan: మీరు ఎస్‌బీఐలో రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే EMI ఎంత కట్టాలి? పూర్తి జాబితా!
ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
