Second Hand AC: సెకండ్ హ్యాండ్ ఏసీ కొనడం వల్ల నష్టాలు ఏమిటి?
Second Hand AC: సెకండ్ హ్యాండ్ ఏసీ జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఇంతకు ముందు ఎవరో ఉపయోగించారు కాబట్టి, దాని సామర్థ్యం, జీవితకాలం ఇప్పటికే తగ్గిపోయి ఉండేది. సెకండ్ హ్యాండ్ ఏసీ ఎక్కువ కాలం పనిచేయకపోవచ్చు. కొన్ని నెలల్లో దాన్ని..

వేసవి కాలం రాగానే ప్రతి ఇంట్లో ఏసీలు, కూడార్ల వాడకం పెరిగిపోతుంటుంది. చాలా మంది ఇళ్లలో సమ్మర్ సీజన్‌లలో ఏసీలను వాడుతుంటారు. ఈ సీజన్‌లో ఎయిర్ కండిషనర్ అవసరం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది డబ్బు ఆదా చేయడానికి సెకండ్ హ్యాండ్ AC కొనాలని ఆలోచిస్తుంటారు. అయితే ఇది కొత్త ఏసీ (AC) కంటే ఎక్కువ పొదుపుగా ఉంటుంది. అయితే సెకండ్ హ్యాండ్ AC కొనడం వల్ల అనేక నష్టాలు ఉండవచ్చు. ఈ నష్టాలను విస్మరించడం వలన మీ భద్రత కోల్పోవచ్చు. అలాగే డబ్బు వృధా కావచ్చు. సెకండ్ హ్యాండ్ ఏసీలో ప్రమాదాలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
పేలుడు ప్రమాదం:
సెకండ్ హ్యాండ్ ఏసీలో అతి పెద్ద ప్రమాదం పేలడం. పాత ACలు తరచుగా చెడిపోయిన లేదా పాత భాగాలను కలిగి ఉంటాయి. కంప్రెసర్, పైప్‌లైన్, విద్యుత్ కనెక్షన్లు వంటి భాగాలు కాలక్రమేణా దెబ్బతింటాయి. దీని కారణంగా చిన్న షార్ట్ సర్క్యూట్ కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. కాలం చెల్లిన సాంకేతికత, తయారీ లోపాలు కూడా పేలుళ్ల వంటి సంఘటనలకు దారితీస్తాయి. అందువల్ల సెకండ్ హ్యాండ్ ఏసీని జాగ్రత్తగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే..
సెకండ్ హ్యాండ్ ఏసీలో తరచుగా ఏదో ఒక సమస్య ఉంటుంది. కంప్రెసర్ దెబ్బతినడం లేదా ఏదైనా విద్యుత్ భాగం పనిచేయడం ఆగిపోవడం కావచ్చు. ఈ సమస్యలను పరిష్కరించడానికి మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. పాత భాగాలను మార్చడం వల్ల కూడా డబ్బు ఖర్చవుతుంది. ఇది కొత్త ఏసీ కొనడం కంటే ఎక్కువ ఖర్చు కావచ్చు.
కొత్త ACకి కంపెనీ గ్యారంటీ, వారంటీని అందిస్తుంది. కానీ ఈ సౌకర్యం సెకండ్ హ్యాండ్ ఏసీలలో అందుబాటులో ఉండదు. ఏసీలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని రిపేర్ చేసుకోవడానికి మీరే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో కూడా పాత భాగాల లభ్యత, మరమ్మతులు సమస్య కావచ్చు.
జీవితకాలం చాలా తక్కువ:
సెకండ్ హ్యాండ్ ఏసీ జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఇంతకు ముందు ఎవరో ఉపయోగించారు కాబట్టి, దాని సామర్థ్యం, జీవితకాలం ఇప్పటికే తగ్గిపోయి ఉండేది. సెకండ్ హ్యాండ్ ఏసీ ఎక్కువ కాలం పనిచేయకపోవచ్చు. కొన్ని నెలల్లో దాన్ని మార్చాల్సి రావచ్చు. కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్ ఏసీలు చాలా చౌకగా లభిస్తాయి. కానీ ఈ చౌకైన వస్తువు మీకు ఖరీదైనది కావచ్చు. అంటే పేలడం, ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా మరింత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుందన్నట్లు. పెరిగిన నిర్వహణ ఖర్చు, విద్యుత్ బిల్లు కారణంగా ఇది మొత్తం మీద చాలా ఖరీదైనదిగా కావచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి